IIFA Awards 2024 : దుబాయ్ వేదికగా ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ సినిమాలకుగానూ వివిధ విభాగాల్లో అవార్డులను అందజేశారు. 'జవాన్' సినిమాకుగానూ షారుక్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోగా, ఉత్తమ చిత్రంగా యానిమల్ ఎంపికైంది. వీటితో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏయే అవార్డులు వచ్చాయంటే?
ఐఫా 2024 విజేతలు వీరే:
- ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా : జయంతిలాల్, హేమా మాలిని
- అచీవ్‌మెంట్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్
- ఉత్తమ విలన్: బాబీ దేవోల్ (యానిమల్)
- ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
- ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్)
- ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )
- ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
- ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ
- ఉత్తమ సంగీతం: యానిమల్
- ఉత్తమ కథ (Adapted): 12th ఫెయిల్
- ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)
- ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్)
- ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)
తెలుగులో 'దసరా' మేనియా
IIFA Awards 2024 Telugu : ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్‌లో రెండో రోజు ఏఆర్ రెహమన్, రానా, సమంత, బాలకృష్ణ, వెంకటేశ్ హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు దక్కించుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని అందుకున్నారు. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని అవార్డును ముద్దాడారు. నందమూరి నటసింహం బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ విలన్ (తెలుగు) అవార్డ్ షైన్ టామ్ (దసరా) దక్కించుకున్నారు. ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును స్టార్ హీరోయిన్ సమంత గెలుచుకున్నారు.
బెస్ట్ యాక్టర్‌గా నాని - చిరంజీవి, బాలయ్యకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు - IIFA Utsavam 2024