భారీ వర్షాలకు ముంబయి వణికిపోతోంది. కుండపోత వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దేశ ఆర్థిక రాజధానితో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ అర్ధరాత్రి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బాంద్రాలో 201 మిల్లీమీటర్లు, మహాలక్ష్మి ప్రాంతంలో 129 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
ముంబయి సబర్బన్‌లో 191.2 మి.మీ, దక్షిణ ముంబయిలో 156.4 మి.మీ, రత్నగిరి జిల్లాలో 127.2 మి.మీ, మరాఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్, ఉస్మానాబాద్ జిల్లాల్లో వరుసగా 96.4 మి.మీ, 25.8 మి.మీ, ఇలా మరికొన్ని జిల్లాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
మరో 24 గంటల పాటు ఇలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి:నెల రోజులు.. రూ.263 కోట్లు నీటిపాలు!