కేరళ, లక్షదీప్లలో పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిశాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న 5 రోజుల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
అక్టోబర్ 20, 21 తేదీల్లో తిరువనంతపురం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, ఇడుక్కి, వయనాడ్, పాలక్కడ్, మలప్పురంలలో వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
మలప్పురంలోని పెరింథాలమన్నలో 12 సెం.మీ, త్రిస్సూర్ జిల్లాలోని కొడుంగల్లూరులో 9 సెం.మీ, ఎర్నాకులంలోని ఆలువాలో 7 సెం.మీ వర్షపాతం కురిసినట్లు ఐఎమ్‌డీ తెలిపింది.
రానున్న 5 రోజుల్లో 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి: 'ఎయిర్ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరం'