దేశ రాజధాని దిల్లీలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. 1.9 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వర్షం కారణంగా వాయు నాణ్యత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పశ్చిమ తీరం నుంచి బలమైన గాలులు వీచిన కారణంగా వర్షం కురిసిందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉష్ణోగ్రత గరిష్ఠంగా 21.5 డిగ్రీలు, కనిష్ఠంగా 12.8 డిగ్రీలు నమోదయిందని స్పష్టం చేశారు.
విమాన మార్గాలు మళ్లింపు...
వాతావరణం ప్రతికూలంగా ఉన్న కారణంగా 17 విమాన సర్వీసులను దారి మళ్లించారు. జైపుర్, అహ్మదాబాద్, అమృత్సర్, లఖ్‌నవూలకు మళ్లించినట్లు వెల్లడించారు. మొదట 10 నిమిషాల పాటు రన్‌వేను నిలిపేసిన అధికారులు వర్షం తీవ్రరూపు దాల్చిన కారణంగా దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు.