దేశవ్యాప్తంగా వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబల్‌పుర్‌లోని నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్ములోని సర్కులర్ రోడ్ ప్రాంతంలో రహదారికి బీటలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ నిలిపి ఉంచిన మూడు వాహనాలు గుంతలోకి పడిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకవ్యాప్తంగా పంట పొలాలు దెబ్బతిన్నాయి. బెలగావిలోని వ్యవసాయ క్షేత్రాలను వరద నీరు ముంచెత్తింది.
ఇదీ చూడండి:- గుజరాత్లో భారీ వర్షాలు- సూరత్ వీధులు జలమయం
ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడం వల్ల గ్రామాల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతింది.
సుక్మాలో.. తమ సహొద్యోగి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళుతూ ఇన్జ్రామ్ నదిని దాటారు సీఆర్పీఎఫ్ జవాన్లు.
ఇదీ చూడండి:- వరదలో చిక్కుకున్న యువకుడు.. హెలికాఫ్టర్‌తో సాయం