భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లటి కబురు. ఈ నెల 29-30వ తేదీల్లో ధూళి, ఉరుములుతో కూడిన వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ(ఐఎమ్‌డీ) వెల్లడించింది.
పశ్చిమంలో కలిగే మార్పుల వల్ల ఈ నెల 29-30న ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని.. ఆ సమయంలో ఈదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎమ్‌డీ ప్రాంతీయ విభాగానికి చెందిన కుల్దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఇది ప్రజలకు తీవ్ర ఉపశమనం కలిగిస్తుందన్నారు.
వేడిగాలులతో దిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని పులు ప్రాంతాలు తల్లడిల్లిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం-మంగళవారం వడగాలుల ప్రభావం భీకరంగా ఉంటుందని వాతావరణశాఖ ఉత్తరభారతంలో హైఅలర్ట్ ప్రకటించింది.
పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఝార్ఖండ్ రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల పాటు వేడిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఎమ్‌డీ సూచించింది.