ETV Bharat / bharat

పెద్దలూ.. కరోనా నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!

author img

By

Published : Mar 30, 2020, 6:21 AM IST

Updated : Mar 30, 2020, 6:36 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వయో వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆరోగ్యమంత్రిత్వశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలని సూచించింది.

Health Ministry issues guidelines for disinfecting public places, dos and dont's for elderly
పెద్దలూ కరోనా నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే కరోనా బారిన పడకుండా ఉండేందుకుగాను.. వయో వృద్ధులకు కొన్ని సూచనలు చేసింది.

వృద్ధులు చేయాల్సినవిచేయకూడనివి
ఇంటి వద్దనే ఉండండి. సందర్శకులను అనుమతించవద్దు. ఒకవేళ అవసరమైతే ఒక మీటరు దూరంలో ఉండి మాట్లాడండి.చేతులను శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకవద్దు.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూ కాగితం, చేతి రుమాలు, లేదా మోచేతిని అడ్డుపెట్టుకోండి. అనారోగ్యంతో ఉన్నవారి వద్దకు వెళ్లొద్దు.
ఇంట్లో వాడిన తాజా, వేడివేడి ఆహారాన్నే తీసుకోండి. సొంతంగా మందులు వాడొద్దు.
తరచూ నీళ్లు తాగండి. వ్యాధి నిరోధకత పెంపునకు తాజా పండ్ల రసాలు తీసుకోండి. ఎవరితోనూ కరచాలనం, ఆలింగనం వద్దు.
వ్యాయామం, ధ్యానం చేయండి.సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లొద్దు.
రోజువారీ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోండి.వీలైనంత వరకూ ఫోన్లోనే వైద్యుల సలహాలు తీసుకోండి
జ్వరం, దగ్గుతో పాటు శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరల్లోని వైద్యుడిని సంప్రదించండి.

అత్యవసరమైతే తప్పించి ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు.

కాటరాక్ట్​, మోకీలు మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోండి.-

వైద్య సిబ్బందికి

కరోనా కేసులు పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బందికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్​ఓపీ) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు, సాంకేతిక నిపుణులకు మార్గనిర్దేశం, శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశం.

"కరోనా రోగులకు, లేదా ఈ వైరస్ సోకినట్లు అనుమానమున్న వ్యక్తులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్​లు ఉండాలి. ప్రస్తుతం ఏఎల్​ఎస్​ (వెంటిలేటర్లతో), బీఎల్​సీ (వెంటిలేటర్స్ లేనివి) అనే రెండు రకాల అంబులెన్స్​లు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వాలు మరిన్ని వాటిని సమకూర్చుకోవచ్చు."

- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఐఆర్​సీటీసీ

రైల్వే క్యాటరింగ్, టూరిజం సంస్థ ఐఆర్​సీటీసీ.. పేదలకు 11,030 భోజనాలను, స్థానిక రుచులతో అందించింది. ముఖ్యంగా దక్షిణాన పులిహోర, తూర్పున ఖిచిడి చోఖా, ఉత్తరాన చావల్ అందించింది. అలాగే రైల్వే కిచెన్లలో తయారు చేసిన వంటకాలను పోలీసు అధికారులు, దిల్లీ పాలనాధికారులు, వలసకూలీలు, వృద్ధాశ్రమాలకు అందిస్తారు.

దేశంలో ప్రస్తుతానికి కరోనా మృతుల సంఖ్య 27కి చేరింది. 1024 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. షట్​డౌన్ పాటించడం వల్ల కరోనా వ్యాప్తి రేటు తగ్గినట్లు ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి: దేశంలో వెయ్యి దాటిన కరోనా కేసులు

Last Updated : Mar 30, 2020, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.