ETV Bharat / bharat

కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈలపై కేంద్రం దృష్టి

కరోనాపై పోరును మరింత ముమ్మరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. పరీక్ష కిట్లు, వైద్యుల కోసం వ్యక్తిగత సంరక్షణ కిట్ల లభ్యత పెంచడంపై దృష్టిపెట్టింది. వైద్య సదుపాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

health
ఒక్కరోజులో 549మందికి కరోనా.. 166కు చేరిన మృతులు
author img

By

Published : Apr 9, 2020, 5:29 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందకు దృష్టిసారించింది కేంద్రం. వ్యక్తిగత రక్షణ కిట్లు(పీపీఈ) అందుబాటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉన్నవాటిని సరైన రీతిలో ఉపయోగించాలని సూచించింది. త్వరలో మరిన్ని కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించింది. ఇప్పటివరకు 1,30,000 పరీక్షలు నిర్వహించామని.. పాజిటివ్​గా తేలుతున్న వారి శాతం 3-5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.

corona
భారత్​లో కరోనా గణాంకాలు

రైల్వే బోగీలు సిద్ధం..

వైరస్ బాధితుల కోసం 3250 బోగీలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. మొత్తంగా 5000 వేల కోచ్​లను సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేసింది. రైల్వే విభాగంలోని 2500 మంది వైద్యులను కరోనా సేవల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పింది. రైల్వేల ద్వారా 6 లక్షల మాస్కులను, 4000 లీటర్ల శానిటైజర్​ను సిద్ధం చేస్తున్నామని చెప్పింది.

వైద్య పరికరాల కోసం..

కరోనాపై పోరు కోసం 49,000 వెంటిలేటర్ల కోసం ఆర్డర్లు ఇచ్చామని చెప్పింది ఆరోగ్య శాఖ. దేశీయంగా ఉన్న 20 ఉత్పత్తి సంస్థల ద్వారా 1.7 కోట్ల పరీక్ష కిట్లను సిద్ధం చేయిస్తున్నట్లు వెల్లడించింది. వైరస్​ పరిస్థితిపై అధ్యయనం కోసం తొమ్మిది రాష్ట్రాలకు పది మందితో నిపుణుల బృందాలను పంపినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 80,000 పడకలను వైరస్ బాధితుల కోసం సిద్ధం చేశామని తెలిపింది.

ఇదీ చూడండి: 'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.