ETV Bharat / bharat

24 గంటల్లో దేశంలో 149 మందికి వైరస్ - Coronavirus majorly affected cities

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 149మందికి కరోనా సోకినట్లు తెలిపారు కేంద్ర వైద్య శాఖ అధికారులు. మొత్తంగా 873మందికి వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య 19కి చేరిందని చెప్పారు. మహమ్మారిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను విశదీకరించారు.

corona health ministry
భారత్​లో పెరిగిన కరోనా కేసులు
author img

By

Published : Mar 28, 2020, 4:56 PM IST

Updated : Mar 28, 2020, 5:42 PM IST

దేశంలో కొత్తగా 149మందికి కరోనా సోకిందని వెల్లడించారు కేంద్ర వైద్య శాఖ అధికారులు. వైరస్ సోకిన వారి సంఖ్య మొత్తంగా 873కు చేరిందని చెప్పారు. మృతుల సంఖ్య 19కి చేరినట్లు స్పష్టం చేశారు. వైరస్​ను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు వైద్య శాఖ అధికారులు. వారిలో రోగ నిరోధక శక్తి పెంచే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. సామాజిక దూరం, లాక్​ డౌన్ పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పునరుద్ఘాటించారు.

ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స..

కరోనా వైరస్​కు మాత్రమే సేవలందించే ఆసుపత్రులను గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు ఆరోగ్య శాఖ అధికారులు. ఈ దిశగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

వారందరికీ పరీక్షలు..

తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కరోనా వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్​తో ప్రభావితమవుతున్నారని ప్రపంచ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని.. వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ నియంత్రణ వ్యాక్సిన్​ను మానవులపై ప్రయోగించే దశకు ప్రపంచ దేశాల పరిశోధనలు ఇంకా చేరలేదని పేర్కొన్నారు.

ప్రైవేటు ల్యాబ్​ల ద్వారా

44 ప్రైవేటు ల్యాబ్​లకు వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించినట్లు స్పష్టం చేశారు. 400 మందికి ప్రైవేటు ల్యాబ్​ల ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అధికారులు పేర్కొన్నారు.

కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కృషి

విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు అధికారులు. వారిని గుర్తించడం ద్వారా వైరస్​ను నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఎయిమ్స్ వైద్యుల శిక్షణలో..

కరోనా బాధితులతో వ్యవహరించే విధానంపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు ఎయిమ్స్ వైద్యులు శిక్షణ ఇస్తున్నారని స్పష్టం చేశారు.

వలస కూలీల కోసం..

వలస కూలీల కోసం ఆయా రాష్ట్రాలు విపత్తు నిర్వహణ నిధులను వినియోగించాలని సూచించింది ఆరోగ్య శాఖ. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

ఇదీ చూడండి: నర్సుకు మోదీ ఫోన్- ఏం మాట్లాడారో విన్నారా?

Last Updated : Mar 28, 2020, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.