ETV Bharat / bharat

'టీకా సైడ్​ ఎఫెక్ట్స్'​పై కేంద్రం కీలక సూచనలు

author img

By

Published : Nov 24, 2020, 5:44 PM IST

కరోనా వ్యాక్సిన్ అందించిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్​ ఎదుర్కొనే దిశగా కేంద్ర వైద్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తీసుకునే చర్యలను బలోపేతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అదనపు వైద్య నిపుణులను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. సవివర సూచనలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లకు లేఖ రాసింది.

Covid-19 vaccination side effects
వ్యాక్సినేషన్​పై కేంద్ర వైద్య శాఖ కీలక ఆదేశాలు

కరోనా వ్యాక్సినేషన్ తర్వాత తలెత్తే ప్రతికూల పరిణామాల(ఏఈఎఫ్ఐ)ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లకు లేఖ రాసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి వివరాలను లేఖలో ప్రస్తావించింది. వ్యాక్సిన్ సరఫరాకు కసరత్తులు ప్రారంభమయ్యాయని తెలిపింది.

"రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తీసుకొనే చర్యలను బలోపేతం చేయాలి. ప్రస్తుతమున్న ఏఈఎఫ్ఐ నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠంగా తయారు చేసేందుకు వైద్య శాఖ పలు కార్యక్రమాలను రూపొందించింది. వీటిని అమలు చేస్తే సరైన సమయంలో వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావాలపై సమాచారం సేకరించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ప్రవేశపెట్టే ముందే ఈ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది."

-వైద్యశాఖ లేఖలోని అంశాలు

ప్రస్తుతం ఉన్న పీడియాట్రీషన్(శిశువైద్యుడు)లతో పాటు అదనపు వైద్య నిపుణులను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు వైద్య శాఖ సూచించింది. రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో ఉన్న ఏఈఎఫ్ఐ కమిటీలలో వీరిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

"వ్యాక్సిన్ తీసుకునే చాలా మందికి ఇతర వ్యాధులు ఉండొచ్చు. వ్యాక్సినేషన్ సమయంలో స్ట్రోక్, గుండెపోటు వంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సిన్​ వల్ల తలెత్తే సమస్యకు, సాధారణ సమస్యకు మధ్య వ్యత్యాసం గుర్తించే న్యూరాలజిస్టులు, కార్డియాలజిస్టులు, శ్వాసకోశ వైద్య నిపుణులను ఏఈఎఫ్ఐ కమిటీలు అందుబాటులో ఉంచుకోవాలి."

-కేంద్ర వైద్య శాఖ లేఖ

ప్రతికూలతల వల్ల ఏర్పడే సమస్యలను సత్వరమే గుర్తించి స్పందించేందుకు వైద్య కళాశాలను ఏఎఫ్ఈఐ సాంకేతిక సహకార కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్రాలకు వైద్య శాఖ సూచించింది. ఔషధ ప్రతికూల పరిస్థితులపై పర్యవేక్షణ కోసం దేశంలో 300 మెడికల్ కళాశాలలు, చిన్న ఆస్పత్రులు ఉన్నాయని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ వల్ల ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే ఈ కేంద్రాల ద్వారా సమాచారం అందించాలని సూచించింది. జిల్లాలోని డ్రగ్ ఇన్​స్పెక్టర్లు.. ఏఈఎఫ్ఐ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. అడ్రినలైన్ ఇంజెక్షన్లను సరిపడా నిల్వ చేసుకోవాలని సూచించింది.

కొవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఏఈఎఫ్ఐ ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని వైద్య శాఖ పేర్కొంది. ఇలాంటి విషయాలను గుర్తించి సమాచారం అందించేందుకు వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏఈఎఫ్ఐ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగించే సేఫ్​వాక్(ఎస్​ఏఎఫ్​ఈవీఏసీ) సాఫ్ట్​వేర్​పై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన ఉండాలని తెలిపింది. వ్యాక్సిన్ భద్రతపై ఎలాంటి వదంతులు, తప్పుడు వార్తలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

ఇదీ చదవండి- కరోనా టీకా పంపిణీకి సిద్దమవ్వండి: మోదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.