ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 'కరోనా' ఆంక్షలు.. అన్నీ బంద్​ - దేశ వ్యాప్తంగా 'కరోనా' ఆంక్షలు.. అన్నీ బంద్​

కరోనా వైరస్​ నివారణ చర్యల్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. జనాలు ఎక్కువగా ఉండే థియేటర్లు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలను ఈనెల చివరి వరకు మూసివేశాయి. సుప్రీం కోర్టులో సామూహిక సందర్శనలను రద్దు చేసింది.

coronavirus
కరోనా ఎఫెక్ట్​
author img

By

Published : Mar 15, 2020, 11:40 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న కారణంగా నివారణ చర్యలు చేపట్టాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కోవిడ్​-19కు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న అన్ని దారులను ఉపయోగిస్తున్నారు అధికారులు. జన సంచారం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాలను మూసివేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

హరియాణాలో..

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు రాష్ట్రంలోని పాఠశాలలు, సినిమా థియేటర్లు, క్లబ్బులను మూసివేసింది హరియాణా ప్రభుత్వం. 200 మందికిపైగా హాజరయ్యే రాజకీయ ర్యాలీలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించింది. మరోవైపు తుది పరీక్షలు షెడ్యూల్​ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేసింది.

హరియాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మలేషియా నుంచి ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ఓ మహిళ రక్త నమూనాలను పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

యూపీలో..

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు నివారణ చర్యలు చేపట్టింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. మార్చి 31 వరకు సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, క్లబ్బులు, డిస్కోలు, స్విమ్మింగ్​ పూల్స్​, జిమ్ములను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అంటువ్యాధిగా గుర్తింపు..

కరోనా వైరస్​ను అంటువ్యాధిగా గుర్తించింది ఉత్తరాఖండ్​ ప్రభుత్వం. తొలి కరోనా కేసు నమోదైన కారణంగా నివారణ చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు ఈనెల 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య కళాశాలలు మాత్రం తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది.

సుప్రీంలో సందర్శనలు రద్దు

సుప్రీంకోర్టు కాంప్లెక్స్​లోకి ఎక్కువ మందిని అనుమతించే సందర్శనలు రద్దు చేసింది కోర్టు. కోర్టు ప్రాంగణంలోని మ్యూజియాన్ని మూసివేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. కోరనా వైరస్​ వ్యాప్తిని నివేరించేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. న్యాయవాధులు, కోర్టు సిబ్బంది, విక్రయదారులు సహా అందరిని సాయంత్రం 5:30 గంటల లోపు బయటకి వెళ్లాలని సూచించింది.

నివారణ చర్యలపై సమీక్ష..

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపడుతున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. క్వారంటైన్​ సౌకర్యాలు, ఐషోలేషన్​ వార్డులు, అవసరమైన వ్యక్తిగత రక్షణ సామగ్రి వంటి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి సందేహాలు పెరుగుతున్న క్రమంలో.. 24 గంటల పాటు కంట్రోల్​ రూమ్ హెల్ప్​లైన్​ను అందుబాటులో ఉంచేలా చూడలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి: భారత్​లో 112కు చేరిన కరోనా కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.