ETV Bharat / bharat

ఉమ్మడి పౌరస్మృతిపై ముందుకేనా? - పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అధికార విపక్షాలు పదునైన అస్త్ర శస్త్రాలతో పరస్పరం తలపడేందుకు సంసిద్ధం కావడం వల్ల వేడి ముందే మొదలైంది. మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉన్న శివసేన తొలిసారి భాజపా వైరిపక్షాలతో కలిసి పాల్గొంటోంది. కనివిని ఎరుగని రీతిలో 36 బిల్లులకు చట్టరూపమిచ్చి రికార్డు సృష్టించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఇంచుమించు అదే సంఖ్యలో బిల్లులతో సమాయత్తమైంది.

ఉమ్మడి పౌరస్మృతిపై ముందుకేనా?
author img

By

Published : Nov 19, 2019, 6:32 AM IST

శీతగాలుల్ని భోగిమంటలతో ఎదుర్కోవాలంటారు. భోగిపండగకు అటుఇటుగా నెలరోజుల ముందు ముగిసే ఈ పార్లమెంటు శీతకాల సమావేశాల్లో అధికార విపక్షాలు పదునైన అస్త్ర శస్త్రాలతో పరస్పరం తలపడేందుకు సంసిద్ధం కావడంతో వేడి ముందే మొదలైంది. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికార పీఠమెక్కాక జరుగుతున్న మలి సమావేశాల్లో మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉన్న శివసేన తొలిసారి భాజపా వైరిపక్షాలతో కలిసి పాల్గొంటోంది.

కిందటి సమావేశాల్లో 67 ఏళ్ల్ల పార్లమెంటు చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 36 బిల్ల్లులకు చట్టరూపమిచ్చి రికార్డు సృష్టించిన మోదీ ప్రభుత్వం- ఇప్పుడు ఇంచుమించు అదే సంఖ్యలో బిల్లులతో సమాయత్తమైంది. భాజపా అజెండాకు మూలస్తంభాలవంటి కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దుతోపాటు ముమ్మార్లు తలాక్‌ను చట్టవిరుద్ధంగా తేల్చి; శతాబ్దాలుగా హిందూ ముస్లిముల మధ్య నలుగుతున్న అయోధ్య వివాదంలో రామాలయ నిర్మాణానికి అనుకూల తీర్పు సాధించిన కేంద్ర ప్రభుత్వం- అదే ఊపును కొనసాగిస్తూ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చకు పెట్టవచ్చన్న అంచనాలు హోరెత్తుతున్నాయి.

అయోధ్య తీర్పు అనంతరం మాట్లాడుతూ- ఇక ఉమ్మడి పౌర స్మృతి అమలుకు సమయం ఆసన్నమైందంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు... యూసీసీ బిల్లును భాజపా సర్కారు ఏ క్షణంలోనైనా తెరమీదకు తీసుకురావచ్చన్న అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవంక కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అజెండాను నెగ్గించుకొనే విషయంలో గతంలో విపక్షాలను విడదీసి, అందులో కొందరిని తమతో కలుపుకొని వ్యూహాత్మకంగా మద్దతు కూడగట్టిన మోదీ సర్కారు, యూసీసీపై ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్న విషయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది!

మతానికో చట్టం....

చట్టబద్ధమైన ప్రతి అంశమూ ధర్మబద్ధం కాకపోవచ్చు. రోడ్డు మీద ప్రమాదానికి గురైన బాలుడిని వైద్యశాలకు చేర్చే క్రమంలో కారును అతివేగంతో నడిపితే ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కోణంలో అది చట్టవ్యతిరేకమవుతుంది. పసిబాలుడి ప్రాణం కాపాడే తరుణంలో ప్రతి క్షణమూ అమూల్యమే కాబట్టి వేగ నియంత్రణలతో నిమిత్తం లేకుండా వేగిరం వైద్యశాలకు చేర్చడమన్నది- పూర్తిగా ధర్మబద్ధం.

భిన్న మతాలు, తెగలు, ఉప తెగల్లో అనాదిగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా దేశంలో 200కు పైగా పర్సనల్‌ లా(వ్యక్తిగత చట్టాలు)లు అమలులో ఉన్నాయి. వివాహం, విడాకులు, పునర్వివాహం, దత్తత, జనన మరణాలు, ఆస్తుల పంపకం, వారసత్వం వంటి వివిధ అంశాలకు సంబంధించి భిన్న మతాలు, తెగలకు వాటికే ప్రత్యేకమైన చట్టాలు, నిబంధనలున్నాయి. మంచి, చెడు, పాపం, పుణ్యం ప్రాతిపదికన మత విశ్వాసాలకు భాష్యకారులు చెప్పుకొన్న వ్యాఖ్యానాలకు అనుగుణంగా వివాహం, విడాకులు, ఆస్తి పంపకం వంటి వ్యవహారాల్లో వ్యక్తిగత నిబంధనల మేరకు నడుచుకోవడం అనాదిగా అమలవుతున్న ధర్మం! ఇది కట్టుబాట్లతో ముడివడిన అంశం.

హిందువులు, ముస్లిములు, పార్సీలు, క్రైస్తవులు, సిక్కులు, నాగా వంటి తెగల పేరిట సమూహానికో చట్టం ఉన్న ఈ పరిస్థితిని మార్చి- దుర్విచక్షణకు, అసమానతలకు తావులేకుండా సువిశాల భారతావనికి నిర్దిష్టంగా వర్తించే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని రాజ్యాంగ నిర్మాతలు అభిలషించారు. మతాలు, భాష్యకారుల అభిమతాలతో నిమిత్తం లేకుండా ఏ సమూహానికి చెందిన సమస్యనైనా కోర్టుల పరిధిలో నిగ్గుతేల్చే ఈ ఉమ్మడి శాసనం పూర్తిగా న్యాయానికి సంబంధించిన అంశం! ఒకే పౌర స్మృతి(యూనిఫైడ్‌ సివిల్‌ కోడ్‌)పై చర్చ జరిగిన ప్రతిసారీ ఈ న్యాయ ధర్మాల అంశం తెరపైకి వస్తూనే ఉంది. వైయక్తిక శాసనాల స్థానే 44వ అధికరణ రూపంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రజలు, ప్రభుత్వాలు సాధించుకోవాల్సిన రాజ్యాంగ ఆదర్శంగా ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తదితర రాజ్యాంగ నిర్మాతలు ఉమ్మడి శిక్షా స్మృతి తరహాలోనే దేశం యూసీసీని కూడా సాధించుకోవాలని బలంగా ఆకాంక్షించారు. సామాజిక పురోగతికి, అభ్యుదయానికి మత చట్టాలను సంస్కరించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసిన అంబేడ్కర్‌- ఆ పని ఆయా మతాలు, తెగల అంగీకారంతో జరగాలే తప్ప ఎవరిపైనా ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా రుద్దరాదని చెప్పడం గమనార్హం. హిందూ కోడ్‌ బిల్లు 1954-55లో అమలులోకి వచ్చింది. అది పట్టాలకెక్కడానికి పద్నాలుగేళ్లకు ముందే 1941లో హిందూ మత చట్టాల సమీక్షకు ‘హిందూ లా రిఫార్మ్స్‌’ కమిటీని ఏర్పాటు చేశారు.

మత చట్టాల సవిస్తర పరిశీలనానంతరం సంబంధిత కమిటీ సమర్పించిన నివేదికపై సర్వత్రా చర్చ జరిగింది. అనంతరం ఆ కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను మూడు దశల్లో ఆమోదించారు. మరోవైపు- విడాకులు (తలాక్‌), బహుభార్యత్వం, మహిళల వారసత్వ హక్కులకు సంబంధించి ముస్లిముల‘షరియా’ (అల్లా వాణి)లోని అసంగతాలను సరిచేయడం కోసం రాజ్యాంగ నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు ముస్లిం మతపెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉమ్మడి పౌర స్మృతి భావన ఆచరణకు రాని రాజ్యాంగ ఆదర్శంగానే మిగిలిపోయింది.

హక్కుల కోసం పోరాటం...

‘దేశంలో ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఉమ్మడి శాసనాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష! పార్లమెంటు సభ్యులెవరైనా ఆ మేరకు బిల్లు ప్రవేశపెడితే వారికి నా సంపూర్ణ సానుభూతిని తెలియజేస్తాను. అయితే దేశంలో ఈ చట్టం తీసుకువచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. ఉమ్మడి పౌర స్మృతి ఆగమనానికి సమాజాన్ని సమాయత్తం చేయాల్సి ఉంది’- భారతావని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి.

ఆరు దశాబ్దాల క్రితం ‘యూసీసీ’ కోసం రాజ్యాంగ నిర్మాతలు కావించిన ప్రయత్నాలకు ఆనాటి ముస్లిం మత పెద్దలనుంచి ఏ స్థాయి వ్యతిరేకత వ్యక్తమైందన్న వాస్తవానికి ఆ మాటలు దర్పణం పడతాయి. మహిళలపట్ల అణచివేతకు, దుర్విచక్షణకు కారణమైన హిందూ పర్సనల్‌ లాను అయిదో దశాబ్దం మలినాళ్లలో క్రోడీకరించడం ద్వారా హిందూ సోదరీమణులకు తాను న్యాయం చేయగలిగినా- ‘షరియా’ చట్టాలను మార్చలేకపోవడం ద్వారా ముస్లిం అక్కచెల్లెళ్లకు న్యాయం చేయలేకపోయినట్లు తరవాతి కాలంలో నెహ్రూ ఆవేదన వ్యక్తీకరించడం ఈ సందర్భంగా గమనార్హం.

స్వాతంత్య్రానంతరం తొలితరం నాయకుల ప్రయత్నాలను మినహాయిస్తే ఇప్పటివరకూ ఇస్లాం సహా వివిధ మత చట్టాల్లోని అసంగతాలను సరిదిద్దేందుకు గట్టి కృషి జరిగిన దాఖలాలు లేవు. ముస్లిం వ్యక్తిగత చట్టాల సంస్కరణ లేదా సమీక్షకు సంబంధించి నేటివరకూ గట్టి కసరత్తు జరగలేదు. మూడున్నర దశాబ్దాలనాడు అహ్మద్‌ ఖాన్‌ తన భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చి- సహేతుక మనోవర్తి చెల్లించేందుకు నిరాకరించిన కేసు క్రమంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని చేరింది. ఇస్లామిక్‌ చట్టాల మేరకు జీవితాంతం తన భార్యకు మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదని అహ్మద్‌ ఖాన్‌ వాదించారు.

భారతీయ నేర న్యాయ స్మృతిలోని 125వ నిబంధన ప్రకారం తల్లిదండ్రుల, భార్యాపిల్లల పోషణ భారం భర్తదేనని ‘సుప్రీం’- షాబానోకు మద్దతుగా 1985లో తీర్పు వెలువరించడం వివాదాల తేనెతుట్టెను కదిపింది. ఆ సందర్భంగా న్యాయస్థానం- ప్రజాస్వామ్య వ్యవస్థల సక్రమ నడవడికి వైయక్తిక మత చట్టాలు ఎక్కడికక్కడ అడ్డంకిగా మారుతున్న తీరును ప్రస్తావించింది.

రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించిన ఉమ్మడి పౌర స్మృతిని సాకారం చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఆ తరవాత 1995లో సరళా ముద్గల్‌ కేసులో, అనంతరం 2003లో జాన్‌వల్లమట్టం కేసు విచారణ సందర్భంగా, 2015లో క్రైస్తవ కుటుంబ విడాకుల కేసు విచారణ తరుణంలో ఆదేశిక సూత్రాల్లోని 44వ అధికరణ(యూసీసీ)పై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టిగా తెలియజెప్పింది.

గోవాలో అమలవుతున్న ఉమ్మడి పౌర స్మృతిని ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. దేశంలో మతాలన్నింటికీ వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతి సిద్ధాంతాన్ని తొలినాళ్లనుంచీ ప్రవచిస్తున్న భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ అంశాన్ని చేర్చింది. ఆర్థిక, రాజకీయ హక్కులకోసం మహిళాలోకం పోరాటాలను ఉద్ధృతం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, అణచివేత ఏ ప్రాతిపదికన జరిగినా దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మత చట్టాలను మొత్తంగా సంస్కరించి ఉమ్మడి పౌర స్మృతి వైపు అడుగులు వేయడమా లేక మహిళాలోకం అణచివేతకు కారణమవుతున్న కట్టుబాట్లను అంతర్గత సంస్కరణల ద్వారా సరిదిద్దుకునేందుకు తగిన పరిస్థితులు సృష్టించడమా అన్న విషయంలో సమగ్ర చర్చ జరగాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2016లో ఈ విషయాన్ని అధ్యయనం చేసిన లా కమిషన్‌ 185 పేజీల సమాలోచన పత్రం వెలువరించింది. ‘అనేక దేశాలు ఇప్పుడిప్పుడే భిన్నత్వాన్ని, భేదాభిప్రాయాలను గుర్తిస్తున్నాయి.

వివిధ సమూహాల మధ్య భిన్నాభిప్రాయాలను దుర్విచక్షణగా పరిగణించరాదు. భిన్నాభిప్రాయం బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతం. కాబట్టి, వైయక్తిక చట్టాల్లోని దుర్విచక్షణను అంతమొందించి వాటిలో సమానతకు తావిచ్చే మార్పులవైపు ప్రయత్నాలు సాగాలి’ అని లా కమిషన్‌ వ్యాఖ్యానించింది. మత చట్టాల్లో దుర్విచక్షణకు తావిచ్చే కట్టుబాట్లను పారదోలే సంస్కరణలకు లాకులెత్తిననాడు ఉమ్మడి పౌర స్మృతి అవసరమే ఉండదన్నది లా కమిషన్‌ అభిప్రాయం. ఉమ్మడి పౌర స్మృతి వైపు మోదీ ప్రభుత్వ ఆలోచనలకు లా కమిషన్‌ సిఫార్సులు తాత్కాలికంగానైనా కళ్ళెం వేసిన సందర్భమది!.

ప్రజాస్వామిక అవగహనతోనే పరిష్కారం...

ఆధునిక సమాజాల్లో పితృస్వామ్యం, పురుషాధిక్య ధోరణులు క్రమంగా కరిగిపోతున్నప్పటికీ వివిధ మత చట్టాల రూపంలో ఇప్పటికీ పురాతన కట్టుబాట్లే అమలులో ఉండటంతో మహిళల అణచివేత కొనసాగుతోంది. ఈ తరుణంలో లా కమిషన్‌ సూచించినట్లు, స్వీయ సంస్కరణల కోణంలో ముస్లిములు సహా వివిధ సమూహాలను సన్నద్ధం చేయడమా లేక ఉమ్మడి పౌర స్మృతి రూపంలో లౌకిక చట్టం తీసుకువచ్చి రాజ్యాంగ ఆదర్శాన్ని నిజం చేయడమా అన్న విషయంలో సహేతుక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘

ముమ్మార్లు తలాక్‌’కు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన భారతీయ ముస్లిం ఆందోళన్‌ సంస్థ ప్రతినిధులు మహిళల అణచివేతకు అంతం పలికే ‘ఉమ్మడి పౌర స్మృతి’కి మద్దతు తెలుపుతామని ప్రకటించడం కీలక పరిణామం. దేశంలో ముస్లిం మహిళల పేదరికాన్ని, వెనకబాటును ‘సచార్‌’ నివేదిక స్పష్టంగా కళ్లకు కట్టిన నేపథ్యంలో- ఆ సంస్థ ప్రతినిధుల ‘ఆందోళన’ అర్థం చేసుకోదగినదే. మతపరమైన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించిన అధికరణ-25 పరిధిలోకి పర్సనల్‌ చట్టాలూ వచ్చినా- ప్రభుత్వాలు సామాజిక సంస్కరణలు చేపట్టకుండా ఆ నిబంధన నిరోధించలేదని; నైతిక, సామాజిక విలువలకు, ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఆచారాలను అనుమతించదని సర్వోన్నత న్యాయస్థానం గతంలో వ్యాఖ్యానించింది.

ఆధునిక అవసరాలకు అనుగుణంగా మత చట్టాలన్నింటినీ ఉమ్మడి స్మృతిగా క్రోడీకరించడమా లేక సమస్య ఆయా చట్టాల్లోని దుర్విచక్షణకు సంబంధించినది కాబట్టి దాన్ని పారదోలుతూ స్వీయ సంస్కరణలకు సమకట్టడమా అన్న విషయంలో లోతైన చర్చ జరగాల్సి ఉంది. ఆయా మత చట్టాల్లో ప్రజాస్వామిక అవగాహనకు అనుగుణంగా నిబంధనలను సంస్కరిస్తే... ఆ ప్రయత్నం క్రమంగా ఉమ్మడి పౌర స్మృతికి బాటలు పరచే అవకాశమూ కొట్టిపారేయలేనిది!

- ఉల్చాల హరిప్రసాదరెడ్డి.

ఇదీ చూడండి:జేఎన్​యూలో ఉద్రిక్తత.. 100మంది అరెస్ట్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kuala Lumpur - 18 November 2019
1. Former Malaysian Prime Minister Najib Razak arrives and enters building
2. Najib walks along corridor and waits for elevator
STORYLINE:
Former Malaysian Prime Minister Najib Razak arrived in court Monday for the start of a new corruption trial.
It's linked to the syphoning of billions of dollars from the 1MDB state investment fund, the scandal that led to his election defeat last year.
Najib is already involved in two other trials.
In this latest trial, he's charged with abusing his position as prime minister and accused of tampering with the auditor-general's final report on the 1MDB investigation.
Najib, 66, denies any wrongdoing and accuses Malaysia's new government of seeking political vengeance.
The patrician former leader, whose father and uncle were the country's second and third prime ministers respectively, could face years in prison if convicted.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.