ETV Bharat / bharat

హాథ్రస్ బాధితురాలి కుటుంబం 5 డిమాండ్లు

హాథ్రస్​‌ హత్యాచార ఘటనలో బాధిత యువతి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. హాథ్రస్​ జిల్లా మెజిస్ట్రేట్​ను కూడా సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు వారిని పరామర్శించిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీకి తమ డిమాండ్లు వివరించారు. యూపీ సర్కారు మాత్రం ఈ కేసును సీబీఐకి సిఫారసు చేసింది

Hathras victim's family wants judicial probe, suspension of DM: Priyanka Gandhi
హాథ్రస్ ఘటనపై యూపీ ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు
author img

By

Published : Oct 4, 2020, 4:37 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్​ ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణకు డిమాండ్ చేశారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. హాథ్రస్​ జిల్లా బుల్​గఢీలో బాధిత కుటుంబాన్ని రాహుల్, ప్రియాంకలతో కూడిన ఐదుగురు సభ్యుల కాంగ్రెస్​ బృందం శనివారం రాత్రి పరామర్శించింది. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చింది. రాహుల్, ప్రియాంక దాదాపు 45 నిమిషాల పాటు బాధిత కుటుంబంతో మాట్లాడారు. అనంతరం వారి డిమాండ్లను ప్రియాంక ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు.

Hathras victim's family wants judicial probe, suspension of DM: Priyanka Gandhi
హాథ్రస్ బాధితురాలి కుటుంబం 5 డిమాండ్లు

1. ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో న్యాయవిచారణ చేపట్టాలి.

2. హాథ్రస్​ జిల్లా మెజిస్ట్రేట్​ను వెంటనే సస్పెండ్​ చేయాలి. ఆయన్ను ఏ విధమైన ముఖ్య పదవుల్లో నియమించవద్దు.

3. తమ అనుమతి లేకుండా పెట్రోల్​ పోసి తమ కుమార్తె దహన సంస్కారాలు ఎందుకు చేశారు?

4. తమను పదే పదే.. తప్పుదోవ పట్టించడం, బెదిరించడం ఎందుకు చేస్తున్నారు?

5. హిందూ సంప్రదాయం ప్రకారం తమ కుమార్తె చితాభస్మం తాము తెచ్చుకున్నామని, అయితే... ఆ చితాభస్మం తమ కుమార్తెదేనని ఎలా నమ్మాలి?

ఈ ప్రశ్నలకు సమాధానం పొందడం బాధిత కుటుంబం హక్కు అని తెలిపారు ప్రియాంక. వీటికి యూపీ సర్కారు సమాధానం చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

హాథ్రస్​ యువతి కుటుంబ సభ్యులను కలిసిన రాహుల్​ గాంధీ వారి బాధను అర్థం చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండి, న్యాయం జరిగేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మృతురాలికి న్యాయం జరిగేలా దేశం మొత్తం అండగా ఉన్నందున.. యూపీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించలేదని రాహుల్ అభిప్రాయపడ్డారు.

హైడ్రామా..

రాహుల్, ప్రియాంక హాథ్రస్​ బయలుదేరే ముందు దిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. హాథ్రస్​లో 144 సెక్షన్​ కొనసాగుతున్నందున పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో దిల్లీ-నోయిడా వంతెనపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పెద్ద సంఖ్యలో గుమిగూడిన కాంగ్రెస్​ కార్యకర్తలను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేస్తుండగా.. ప్రియాంక గాంధీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ మగ పోలీసు ప్రియాంక గాంధీ కుర్తాను పట్టుకున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మహిళలను యూపీ సర్కారు అగౌరవపరుస్తోందంటూ పలువురు కాంగ్రెస్​ నేతలు ఆక్షేపించారు.

కేసు సీబీఐకి..

హాథ్రస్​ ఘటనపై యూపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తీవ్ర వివాదాస్పదమైన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన పూర్వాపరాలన్నిటిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.