దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటన బాధితురాలి అంత్యక్రియలు బుధవారం వేకువ జామున జరిగాయి. అయితే తమ అనుమతి లేకుండా యూపీ పోలీసులు హుటాహుటిన కార్యక్రమం నిర్వహించారని బాధితురాలి సోదరుడు ఆరోపించారు. దిల్లీ సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో బాధితురాలు మరణించిన రోజే భౌతిక కాయాన్ని హత్రాస్ తరలించినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియలను బంధువుల సమక్షంలో బుధవారం రోజు నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదన్నారు.
అయితే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతితోనే కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. హత్రాస్ జిల్లా కలెక్టర్ సైతం అదే విషయాన్ని స్పష్టంచేశారు.
సిట్ ఏర్పాటు
సెప్టెంబరు 14న జరిగిన ఎస్సీ యువతి అత్యాచర ఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారం రోజుల్లోగా నివేదిక అందజేస్తారని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, న్యాయప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
యోగికి మోదీ ఫోన్..
-
Prime Minister Narendra Modi spoke to me over #Hathras incident, he said that strictest of action be taken against the culprits: UP CM Yogi Adityanath pic.twitter.com/bqMQpCqOEO
— ANI UP (@ANINewsUP) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi spoke to me over #Hathras incident, he said that strictest of action be taken against the culprits: UP CM Yogi Adityanath pic.twitter.com/bqMQpCqOEO
— ANI UP (@ANINewsUP) September 30, 2020Prime Minister Narendra Modi spoke to me over #Hathras incident, he said that strictest of action be taken against the culprits: UP CM Yogi Adityanath pic.twitter.com/bqMQpCqOEO
— ANI UP (@ANINewsUP) September 30, 2020
ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి హత్రాస్ అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారని యోగి తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మోదీ చెప్పారని ట్వీట్ చేశారు.
యోగి రాజీనామాకు డిమాండ్..
అంత్యక్రియలు బలవంతంగా నిర్వహించారనే వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. బాధితురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించే చివరి అవకాశం కూడా ఆమె కుటుంబ సభ్యులకు దక్కకుండా చేశారని ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
-
भारत की एक बेटी का रेप-क़त्ल किया जाता है, तथ्य दबाए जाते हैं और अन्त में उसके परिवार से अंतिम संस्कार का हक़ भी छीन लिया जाता है।
— Rahul Gandhi (@RahulGandhi) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ये अपमानजनक और अन्यायपूर्ण है।#HathrasHorrorShocksIndia pic.twitter.com/SusyKV6CfE
">भारत की एक बेटी का रेप-क़त्ल किया जाता है, तथ्य दबाए जाते हैं और अन्त में उसके परिवार से अंतिम संस्कार का हक़ भी छीन लिया जाता है।
— Rahul Gandhi (@RahulGandhi) September 30, 2020
ये अपमानजनक और अन्यायपूर्ण है।#HathrasHorrorShocksIndia pic.twitter.com/SusyKV6CfEभारत की एक बेटी का रेप-क़त्ल किया जाता है, तथ्य दबाए जाते हैं और अन्त में उसके परिवार से अंतिम संस्कार का हक़ भी छीन लिया जाता है।
— Rahul Gandhi (@RahulGandhi) September 30, 2020
ये अपमानजनक और अन्यायपूर्ण है।#HathrasHorrorShocksIndia pic.twitter.com/SusyKV6CfE
" ఓ కూతురిపై అత్యాచారం చేసి హతమార్చారు. వాస్తవాలను కప్పిపెట్టారు. చివరకు అంత్యక్రియలు నిర్వహించకుండా బాధితురాలి కుటుంబ సభ్యుల హక్కులను కూడా హరించారు. ఇది అవమానం, అన్యాయం"
-రాహుల్ ట్వీట్.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా యోగి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వారి హక్కులను కాల రాస్తోందని విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిరసనలు..
అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్సీ సంఘాలు హత్రాస్‌లో నిరసనలు చేపట్టాయి. పోలీసులు, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.