హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధికార భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 46 సీట్లు సాధించే అవకాశాలు కనిపించటం లేదు. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి.
అధికారం ఎవరిది..?
హంగ్ ఏర్పడితే అధికారం ఎవరిదనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న జేజేపీ... తమకు ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ జేజేపీతో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని స్థానాలు వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ జేజేపీతో పాటు స్వతంత్రులూ కింగ్ మేకర్లుగా నిలిచే అవకాశం ఉంది.
భాజపాతో జేజేపీ జట్టు కడితే ఎలాంటి రాజకీయ ఉత్కంఠ ఉండదు.. కానీ అలా జరగని తరుణంలో అధికార పీఠాన్ని ఎవరు చేజిక్కించుకుంటారన్నది ఆసక్తికరం.
ఇదీ చూడండి: 'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..