ETV Bharat / bharat

సీఎంకు నిరసన సెగ- నల్ల జెండాలతో ఆందోళనలు - Farmers shown black flag in Haryana

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. 'జల్​ అధికార్​ ర్యాలీ'ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా కొందరు నల్లజెండాలు ప్రదర్శించారు.

Haryana CM shown black flags by farmers
ఆ రాష్ట్ర సీఎంకు నిరసన సెగ- నల్ల జెండాలతో ఆందోళనలు
author img

By

Published : Dec 20, 2020, 7:47 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల నుంచి హరియాణా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్ తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. నార్నోల్​లో చేపట్టిన 'జల్​ అధికార్ ర్యాలీ'లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నల్లజెండాలను ప్రదర్శిస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు ఆందోళనకారులు. ఇంతలో భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్​ 26నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనకు దిగారు కర్షకులు.

ఇదీ చదవండి: 'దాడులకు భయపడం- మా గెలుపు తథ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.