ETV Bharat / bharat

ఆంధ్రా బాటలో ఆ రాష్ట్రం- 75 శాతం ఉద్యోగాలు వారికే

ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా ముసాయిదా ఆర్డినెన్స్​కు ఆమెదముద్ర వేసింది హరియాణా ప్రభుత్వం. ఈ నిర్ణయంతో స్థానిక యువతకు మేలు జరగనుంది తెలిపారు ఉప ముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా.

Haryana Clears Ordinance to Reserve 75% Jobs in Private Sector
ఇకపై ప్రైవేటు సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే!
author img

By

Published : Jul 6, 2020, 9:15 PM IST

Updated : Jul 6, 2020, 9:24 PM IST

హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ ముసాయిదా ఆర్డినెన్స్​కు ఆమోదం తెలిపింది.

రాష్ట్ర కేబినెట్​ భేటీలో ఆర్డినెన్స్​ను ప్రవేశపెట్టారు ఉపముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా. అనంతరం ఆర్డినెన్స్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ట్వీట్​ చేశారు.

" రాష్ట్ర యువతకు ఇది ఒక చారిత్రక రోజు. హరియాణాలోని ప్రైవేటు సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే ఇచ్చేలా చేసే ముసాయిదా ఆర్డినెన్స్​కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం స్థానిక యువతకు మేలు చేకూర్చనుంది."

- దుష్యంత్​ చౌతాలా, ఉప ముఖ్యమంత్రి, హరియాణా

ఆంధ్రా బాటలో...

ఇటీవల ఆంధ్రప్రదేశ్​ సర్కార్​ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పరిశ్రమలు/ఫ్యాక్టరీలు, పీపీపీ ప్రాజెక్టుల్లో స్థానికులకు 75 శాతానికి తగ్గకుండా ఉపాధి/ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొంటూ గతేడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం 'ఏపీ ఎంప్లాయిమెంట్ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్ ఇన్‌ ది ఇండస్ట్రీస్‌/ఫ్యాక్టరీస్‌ చట్టం-2019ట తీసుకొచ్చింది. సెక్షన్‌ 3 ప్రకారం 75% ఉద్యోగాలు స్థానిక అభ్యర్థులకే ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిలో విఫలమైతే సెక్షన్‌ 8 ప్రకారం యాజమాన్యానికి జరిమానా విధించవచ్చని పేర్కొంది.

Last Updated : Jul 6, 2020, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.