ETV Bharat / bharat

కీలక పరీక్షల్లో ఎల్​యూహెచ్​ పాస్ - high altitude trials in Himalayas

దేశీయంగా హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌ (హాల్) తయారు చేసిన లైట్ ‌యుటిలిటీ హెలికాప్టర్ ఎల్​యూహెచ్​ ప్రతికూల పరీక్షలను పూర్తి చేసుకుంది. ఎత్తైన హిమాలయ పర్వతాల్లో... అత్యంత వేడి ప్రదేశాల్లో పనిచేయగల సామర్థ్యంతో హాల్ దీనిని రూపొందించింది.

HALs Light Utility Helicopter completes hot, high altitude trials in Himalayas
ఎల్​యూహెచ్ హెలికాప్టర్.. ప్రతికూల పరీక్షల్లో పాస్​
author img

By

Published : Sep 9, 2020, 2:45 PM IST

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అనేక రక్షణ పరికరాల పనితీరు పరీక్షలను భారత్‌ వేగవంతం చేసింది. తాజాగా హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌ (హాల్) తయారు చేసిన లైట్ ‌యుటిలిటీ హెలికాప్టర్ ఎల్​యూహెచ్​ పరీక్షలను పూర్తి చేసుకుంది. ఎత్తైన హిమాలయ పర్వత సానువులు, అత్యంత వేడి ప్రదేశాల్లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్​యూహెచ్ పాసైంది.

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమిగా పేరుగాంచిన సియాచిన్ గ్లేసియర్​పై నిర్వహించిన టెస్టుల్లోనూ ఎల్​యూహెచ్ పాసైనట్లు హాల్‌ వెల్లడించింది. ఇక్కడ యుద్ధ సామగ్రి మోసే హెలికాప్టర్‌ సామర్థ్యాన్ని పరీక్షించారు.

మూడు టన్నుల వరకు యుద్ధ సామగ్రిని తీసుకెళ్లేందుకు వీలుగా దీనిని హాల్ రూపొందించింది. ఇది గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తేలిక పాటి హెలికాప్టర్ తరగతికి చెందినదని పేర్కొంది.

ఇదీ చూడండి: పాక్​ సరిహద్దుల్లో ఇద్దరు చొరబాటుదారులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.