ETV Bharat / bharat

క్వారంటైన్‌ ఛార్జీలు సగం వాపస్‌

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్వారంటైన్‌ కాలపరిమితిని 14 నుంచి 7 రోజులకు కుదించిన కారణంగా వారి నుంచి వసూలుచేసిన మొత్తంలో సగం వెనక్కు ఇచ్చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.

quarantine
క్వారంటైన్‌
author img

By

Published : May 27, 2020, 6:52 AM IST

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వ్యవస్థాగత క్వారంటైన్‌ కాలపరిమితిని 14 నుంచి 7 రోజులకు కుదించారు. అందువల్ల వారి నుంచి 14 రోజులకు వసూలుచేసిన మొత్తంలో సగం వెనక్కు ఇచ్చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.

ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజుల క్వారంటైన్‌ కోసం హోటళ్లకు ముందుగానే మొత్తం ఛార్జీలు చెల్లించారు. ఇప్పుడు ఏడురోజులకే వారు ఇంటికెళ్లి గృహనిర్బంధంలో ఉండటానికి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మిగతా సగం మొత్తాన్ని ఎలాంటి జాప్యం లేకుండా హోటళ్లు తిరిగి ఇచ్చేయాలని ఆయన నిర్దేశించారు.

ఏడు రోజులే క్వారంటైన్‌..

విదేశాల నుంచి నగరానికి వచ్చినవారు ఇప్పుడు వారం రోజుల క్వారంటైన్‌ అనంతరం ఇళ్లకు వెళ్లవచ్చు. అక్కడ మాత్రం మరో వారం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు సడలించాయి.

ప్యాకేజీల ధరల్లో మార్పు..

హోటళ్లలో క్వారంటైన్‌ ప్యాకేజీ ధరలూ మారాయి. గతంలో 14 రోజులకు రూ.15 వేలు, రూ.30 వేల చొప్పున రెండు ప్యాకేజీలు ప్రకటించారు. ఇప్పుడు ఏడు రోజులకు సంబంధించి రెండు వేర్వేరు ప్యాకేజీలకు రూ.8వేలు, రూ.16వేల చొప్పున ధర నిర్ణయించారు. 14 రోజులు ఇక్కడే ఉంటామనుకునేవారు పాత ప్యాకేజీల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.