ETV Bharat / bharat

'డిప్యూటీ సీఎం ఆఫర్​ను తిరస్కరించా' - దిగ్విజయ సింగ్​

పార్టీని వీడడానికి ముందే కాంగ్రెస్ తనకు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆఫర్​ ఇచ్చినట్లు చెప్పారు భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే దానిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కమల్​నాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

Had turned down MP Dy CM's post offered by Cong, says Scindia
'డిప్యూటీ సీఎం ఆఫర్​ను తిరస్కరించా'
author img

By

Published : Aug 24, 2020, 11:53 AM IST

కాంగ్రెస్​లో​ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(2018) అనంతరం అధిష్ఠానం తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్​ ఇచ్చిందని వెల్లడించారు భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. ప్రజల కోసం పని చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో భాజపా చేపట్టిన మూడు రోజుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు సింధియా. తొలిసారి ఈ విషయాన్ని వెల్లడించారు.

" మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు నమ్మకద్రోహం చేసింది. రైతులకు 10 రోజుల్లో రూ.2లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని హామి ఇచ్చారు. అలా జరగపోతే సీఎం తప్పుకుంటారని రాహుల్​ అన్నారు. కానీ హామీ నెరవేర్చలేకపోయారు. కమల్​నాథ్​, దిగ్విజయ సింగ్​ ప్రభుత్వాన్ని 15 నెలల్లోనే నాశనం చేస్తారని నాకు అప్పుడే అర్థమైంది."

-జ్యోతిరాదిత్య సింధియా.

భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సింధియా. అధికారం కోల్పోయిన ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల మధ్యకు వచ్చారని ఎద్దేవా చేశారు.

పార్టీని పునరుద్ధరిస్తున్నాం..

జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన తర్వాత గ్వాలియర్​-ఛంబల్​ ప్రాంతంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావించారని.. కానీ పార్టీని పునరుద్ధరించామని సీనియర్​ నేత దిగ్విజయ సింగ్ చెప్పారు. రాహుల్​, ప్రియాంకకు సన్నిహితుడైన సింధియా కాంగ్రెస్​ నుంచి వెళ్లిపోతారని తాను ఊహించలేదన్నారు. పార్టీ ఆయనకు అన్నీ ఇచ్చిందని పేర్కొన్నారు.

గతంలో సింధియాను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనకు కమల్​నాథ్​ ఒప్పుకోలేదని దిగ్విజయ్​ వెల్లడించారు.

మార్చిలో తన వర్గం ఎమ్మెల్యేలు 22 మందితో కలిసి భాజపాలో చేరారు సింధియా. ఫలితంగా 15 నెలలకే కమల్​నాథ్ సర్కార్​ కుప్పకూలింది. అనంతరం బలపరీక్షలో గెలిచి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సింధియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన వర్గం ఎమ్మెల్యేలకు శివరాజ్ సింగ్ చౌహాన్​ మంత్రివర్గంలో కీలక శాఖలు దక్కాయి.

ఇటీవల కాంగ్రెస్​కు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి భాజపాలో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి చెందారు. మొత్తం 27 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. అందులో గ్వాలియర్​-ఛంబల్​ ప్రాంతంలోనే 16 స్థానాలున్నాయి. అందుకే అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది భాజపా.

మధ్యప్రదేశ్​ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలున్నాయి. ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్​కు 89 మంది సభ్యుల బలముంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.