కరోనా నియంత్రణకు సరైన జాగ్రత్తలు పాటించని వారిపై మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా అధికారులు వినూత్న చర్యలకు ఉపక్రమించారు. మాస్కులు ధరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారు ఇకపై ఆసుపత్రులు, పోలీస్ చెక్ పోస్టుల్లో మూడు రోజుల పాటు వలంటీర్లుగా పనిచేయాలని తేల్చిచెప్పారు.
"బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా, నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానా విధిస్తారు. దీనితో పాటు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, క్లినిక్స్, పోలీస్ చెక్పోస్టుల్లో మూడు రోజుల పాటు పనిచేయాలి."
--- జిల్లా యంత్రాంగం ఆదేశాలు.