దేశంలో మరో ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. అహ్మదాబాద్- ముంబయి మార్గంలో తేజస్ రైలును రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ గుజరాత్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు.
దేశంలో తొలి ప్రైవేట్ రైలుగా లఖ్‌నవూ-దిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ -ముంబయి రూట్లో రెండో తేజస్ రైలు తీసుకొచ్చారు.
ఈ రైలు బుకింగ్స్‌ను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. రాకపోకలు ఈ నెల 19న పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ రైల్ కనెక్ట్ ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.