ETV Bharat / bharat

లాక్​డౌన్ 2.0పై రేపు మార్గదర్శకాలు- 3 జోన్లుగా భారత్​! - కరోనా వైరస్​ ఇండియా

లాక్​డౌన్​ పొడిగింపుపై పూర్తిస్థాయి మార్గదర్శకాలను బుధవారం ప్రకటించనునట్టు వెల్లడించారు ప్రధాని మోదీ. అయితే కరోనా కేసుల సంఖ్యను పరిగణించి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే అవకాశముంది.

guidelines-to-be-issues-tomorrow-by-the-centre-for-lockdown-extensions
లాక్​డౌన్​పై రేపు మార్గనిర్దేశకాలు- మూడు జోన్లుగా భారత్​!
author img

By

Published : Apr 14, 2020, 12:22 PM IST

దేశంలో ఉన్న లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగించింది కేంద్రం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం వెల్లడించనున్నట్టు జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఈ నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా విభజించే అవకాశముందన్న వార్తలు జోరందుకున్నాయి. దేశంలో నమోదైన కరోనా కేసుల ఆధారంగా రెడ్​, ఆరెంజ్​, గ్రీన్​ జోన్లుగా విభజించేందుకు ప్రణాళిక ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జోన్లు ఇలా..

  • రెడ్‌ జోన్‌: కరోనా కేసులు 15 కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన జోన్లలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. అన్ని రకాల కార్యకలాపాలపైనా నిషేధం ఉంటుంది. ప్రజలు కచ్చితంగా ఇళ్లల్లోనే ఉండాలి. నిత్యావసరాల కొనుగోళ్ల కోసం బయటకు వచ్చే వీలుండదు.
  • ఆరెంజ్‌ జోన్‌: 15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని సర్వీసులు నడపడం, వ్యవసాయ పనులకు అనుమతులు ఉంటాయి.
  • గ్రీన్‌జోన్‌: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా గుర్తిస్తారు. ఈ పరిధిలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. దేశంలో దాదాపు 430 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు.

వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్​ 20 నుంచి అత్యవసరాలకు ఆంక్షలతో కూడిన అనుమతులిస్తున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు మోదీ. ఆ సడలింపులపైనా బుధవారం స్పష్టత రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.