ETV Bharat / bharat

'అలా జరిగితే రెండంచెల జీఎస్టీ సాధ్యమే!' - సంస్కరణలు

రెవెన్యూ పెంచేందుకు వస్తు సేవల పన్నులో సంస్కరణలు రానున్నాయని కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో 12, 18 శాతంగానే పన్ను స్లాబులు ఉండే అవకాశం ఉందన్నారు.

జైట్లీ
author img

By

Published : Jul 1, 2019, 6:52 PM IST

వస్తు సేవల పన్నులో మరిన్ని సంస్కరణలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ తెలిపారు. రెవెన్యూ పెంచేందుకు రెండు స్లాబుల్లోనే జీఎస్టీని అమలు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 12, 18 శాతం పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయని అంచనా వేశారు.
జీఎస్టీ ప్రారంభమయి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జైట్లీ పలు విషయాలపై స్పందించారు.

"లగ్జరీ వస్తువులను మినహాయించి 28 శాతం స్లాబును పూర్తిగా తొలగించాం. 0, 5 శాతం స్లాబులు ఎప్పటికీ ఉంటాయి. భవిష్యత్తులో రెవెన్యూ పెరిగితే వీటిని 12, 18 శాతం స్లాబుల్లో కలిపి జీఎస్టీని రెండంచెల పన్నుగా మార్చొచ్చు."

-అరుణ్ జైట్లీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి

పెరుగుతున్న రెవెన్యూ

ఇటీవల కొన్ని వస్తువులపై అకస్మాత్తుగా పన్ను రేట్లను తగ్గించటం వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయం పడిపోయిందన్నారు జైట్లీ. ఈ పరిస్థితి నుంచి క్రమంగా కోలుకుంటున్నామని తెలిపారు.

"2017-18 (జులై-మార్చ్​) సమయంలో నెలకు సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. ఆ తర్వాత ఏడాది 2018-19కి 10 శాతం వృద్ధితో రూ.97,100 కోట్లకు పెరిగింది. రాష్ట్రాల పరంగా చూస్తే... ఈ రెండేళ్లలో 20 రాష్ట్రాల రెవెన్యూ 14 శాతం పెరిగింది. ఇదే కొనసాగితే రాష్ట్రాల రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు."

ఒకే రేటు సాధ్యపడదు

ఒకే స్లాబు జీఎస్టీ అనేది భారత్​లో సాధ్యం కాదని జైట్లీ తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దారిద్రరేఖకు దిగువన ఉండటం మూలాన వస్తువులను బట్టి భేదాలు అవసరమేనని స్పష్టం చేశారు.

"జీఎస్టీకి ముందు అన్ని వస్తువులకు ఒకే స్లాబ్ ఉండేది. కానీ బహుళ పన్ను విధానం వచ్చాక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం మాత్రమే కాక ధరలు పేదవారికి అందుబాటులోకి వచ్చాయి. హవాయి చెప్పులు, బెంజ్​ కారుకు ఒకే పన్ను రేటు సరైన విధానం కాదు."

17 స్థానిక పన్నులను కలిపి 2017 జులై 1న వస్తు సేవల పన్ను విధానాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం జీఎస్టీలో 5,12,18, 28 శాతాలున్న 4 స్లాబులు ఉన్నాయి.

ఇదీ చూడండి: జీఎస్టీ 2.0: సంస్కరణలకు ఇదే సమయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.