ETV Bharat / bharat

'నితీశ్​ ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు?'

త్వరలో బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార జేడీయూ, సీఎం నితీశ్​కుమార్​పై విరుచుకుపడ్డారు ఆర్జేడీ నేత​ తేజస్వీ యాదవ్​. ఎన్నికలొచ్చినప్పుడే మోదీకి, నితీశ్​కుమార్​కు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జేడీయూ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి ప్రచార ఆర్భాటాలకు పోతోందని ధ్వజమెత్తారు..

'Grandiose PR exercises' poor substitute for governance
'నితీశ్​ ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు?'
author img

By

Published : Sep 21, 2020, 1:35 PM IST

బిహార్​లో ప్రస్తుతం నిరుద్యోగం, వ్యవసాయ కార్పొరేటీకరణ, కరోనా విజృంభణే ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు రాష్ట్రీయ జనతా దళ్​ నేత​ తేజస్వీ యాదవ్. బిహార్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు తేజస్వీ.

రైతుల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ ఎల్లప్పుడూ పోరాడుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల వల్ల రైతుల ఆర్థిక భద్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. బిల్లులు సరిగా ఉంటే ప్రభుత్వంలో భాగమైన కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు.

బిహార్​ ఎన్నికలను నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామ్య అనుకూల శక్తుల కూటమికి.. అధికార, రాజ్యాంగ వ్యతిరేక పాలన అందించిన శక్తుల కూటమికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు తేజస్వి.

తన విజయాల గురించి గర్వంగా చెబుతున్న నితీశ్​కుమార్.. ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే.. సింగిల్​ డిజిట్​ సీట్లను సైతం గెలుచుకోలేరని తాను బలంగా నమ్ముతున్నట్లు నొక్కిచెప్పారు. నితీశ్​ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి ప్రచార ఆర్భాటాలకు పోతోందని దుయ్యబట్టారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపైనా తేజస్వీ యాదవ్​ మాట్లాడారు. సుశాంత్ మృతిపై మొదట సీబీఐ విచారణకు కోరింది తామేనని గుర్తు చేశారు. అయితే తాము ఆ విషయాన్ని రాజకీయం చేయదల్చుకోలేదన్నారు.

'మహాకుటమి ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా? ' అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు తేజస్వి. తనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తున్నానని, భవిష్యత్తులోనూ అలాగే చేస్తానని చెప్పారు.

ఇదీ చూడండి: ఆర్​జేడీ ఎన్నికల పోస్టర్​లో లాలూ మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.