మాజీ ప్రధాన మంత్రుల గొప్పతనం చాటేలా దేశ రాజధాని దిల్లీలో ఆధునిక మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ జీవితంపై... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మోదీ.
చంద్రశేఖర్ మరణించి 12 ఏళ్లు గడిచినా ఆయన ఆలోచనలు కళ్లముందే మెదులుతున్నాయని అన్నారు మోదీ. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు చంద్రశేఖర్ తనను ఇంటికి పిలిపించి దేశ రాజకీయాలపై చర్చించారని గుర్తు చేసుకున్నారు.
దేశంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు మోదీ. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల మాజీ ప్రధానుల గొప్పతనంతో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఒసామా సమాచారం పాక్కు తెలియదు'