ETV Bharat / bharat

ప్రభుత్వ అజాగ్రత్తతోనే సైనికుల ప్రాణాలు బలి: రాహుల్​ - India China Faceoff

ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లద్దాఖ్ గల్వాన్​ వ్యాలీలో జరిగిన ఘర్షణ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని.. రక్షణశాఖ సహాయమంత్రి నివేదిక రుజువు పరుస్తోందన్నారు. సరిహద్దు ఘర్షణపై శివసేన కూడా స్పందించింది. భారత ఆత్మగౌరవం, సమగ్రతపై జరిగిన దాడిగా అభివర్ణించింది.

rahul
'ప్రభుత్వ మొద్దునిద్రకు మూల్యం.. సైనికుల ప్రాణాలు'
author img

By

Published : Jun 19, 2020, 1:42 PM IST

సరిహద్దు ఘర్షణపై కేంద్రం లక్ష్యంగా మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లద్దాక్​లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పారు. అయితే దీనికి సైనికులు మూల్యం చెల్లించగా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ఎద్దేవా చేశారు. మరికొద్దిగంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అఖిల పక్ష భేటీ జరగనుండగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"ముందస్తు ప్రణాళిక ప్రకారమే గల్వాన్ వ్యాలీలో ఘర్షణ జరిగిందని ఇప్పుడు స్పష్టమైంది. అయితే ప్రభుత్వం సమస్య లేదని పేర్కొంటూ మొద్దునిద్ర పోతోంది. దీనికి సైనికులు మూల్యం చెల్లించారు."

-రాహుల్ గాంధీ, ట్విట్టర్

ముందస్తు ప్రణాళిక ప్రకారమే చైనా దాడి అని వ్యాఖ్యానించిన.. రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్ నివేదిక ఆధారంగా పై వ్యాఖ్యలు చేశారు రాహుల్.

ప్రధాని లక్ష్యంగా సేన విమర్శనాస్త్రాలు..

సరిహద్దు ఘర్షణ అంశమై ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేసింది శివసేన. చైనాతో ఘర్షణను భారత్ ఆత్మగౌరవం, సమగ్రతపై జరిగిన దాడిగా తన అధికారిక పత్రిక సామ్నాలో అభివర్ణించింది. 'భారత జవాన్లు అప్రమత్తంగా లేని సమయంలో చైనా సైనికులు దాడి చేశారు. ఇప్పటికే పాక్ సైన్యం ఎప్పటికప్పుడు భారత్ లక్ష్యంగా విరుచుకుపడుతోంది. కానీ మనం ఒకరికి పదిమందిని మట్టుబెట్టాం అని సంతోషిస్తున్నాం' అని పేర్కొంది.

ఇదీ చూడండి: గల్వాన్‌ ఘటనలో 76 మంది సైనికులకు గాయాలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.