జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) తుది పట్టికలో పేరు లేనంత మాత్రాన విదేశీయులు అయిపోరని కేంద్ర హోం శాఖ స్పష్టంచేసింది. అర్హత ఉన్న వారు తిరిగి అప్పీలు చేసుకునే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
ఎన్ఆర్సీలో ఆగస్టు 31వ తేదీలోపు పేరు నమోదవ్వని వారికోసం విదేశీ ట్రైబ్యునల్లో అప్పీలు చేసుకునేందుకు 60 నుంచి 120 రోజులకు గడువును పెంచుతామని తెలిపింది కేంద్ర హోంశాఖ. 2003 నాటి పౌర నిబంధనలనూ మార్చే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది.
అసోం ముఖ్యమంత్రి సహా పలువురు ఉన్నతాధికారుతో దిల్లీలో సమావేశమై కేంద్ర హోం మంత్రి షా సహా ఈ నిర్ణయం తీసుకున్నారు.
"1946, 1964 విదేశీయుల చట్టం ప్రకారం... విదేశీయుల ట్రైబ్యునల్ మాత్రమే ఓ వ్యక్తి పరదేశీయుడని నిర్ధరించగలదు. కాబట్టి... ఎన్ఆర్సీలో పేరు లేనంత మాత్రాన ఆ వ్యక్తి విదేశీయుడు అయిపోడు. ఎన్ఆర్సీలో చోటు లభించని వారికి రాష్ట్రప్రభుత్వం తరఫున న్యాయ సహకారం అందించాలని నిర్ణయించాం."
-కేంద్ర హోంశాఖ ప్రకటన సారాంశం
ఇదీ చూడండి: హైఅలర్ట్: దేశంలోకి ప్రవేశించిన ఐఎస్ఐ ముఠా!