ETV Bharat / bharat

ఆరోగ్య భారత్​కు 12,500 ఆయుష్​ కేంద్రాలు: మోదీ - modi

దేశవ్యాప్తంగా 12వేల 500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏడాదిలోగా 4వేల కేంద్రాలను నిర్మిస్తామని దిల్లీలో జరిగిన యోగా అవార్డుల కార్యక్రమంలో తెలిపారు.

ఆరోగ్య భారత్​కు 12,500 ఆయూష్​ కేంద్రాలు: మోదీ
author img

By

Published : Aug 30, 2019, 1:50 PM IST

Updated : Sep 28, 2019, 8:45 PM IST

ఆయుష్ మంత్రిత్వ శాఖ దిల్లీలో నిర్వహించిన యోగా అవార్డుల వేడుకకు హాజరయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశ వ్యాప్తంగా 1.5లక్షల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 12వేల 500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు మోదీ. ఏడాదిలోగా 4000 కేంద్రాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న మోదీ

"యోగా సాధకులు, శిక్షకులు, ప్రపంచ వ్యాప్తంగా యోగాను విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారికి, సంస్థలకు పురస్కారాలు ప్రధానం చేసే అదృష్టం నాకు దక్కింది. అందరికీ నా శుభాకాంక్షలు. సమాజంలో సుఖ సంతోషాలు నెలకొల్పడంలో వీరంతా సఫలీకృతులయ్యారు. ఆయుష్‌ వైద్య విధానాన్ని అభివృద్ధి చేసిన 12 మంది ప్రముఖులతో కూడిన పోస్టల్‌ స్టాంపులను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశాం.ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వీటన్నింటినీ కలిపి ఆయుష్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం. ఈరోజు 10 ఆయుష్‌ కేంద్రాలను హరియాణలో ప్రారంభించాం."
-నరేంద్ర మోదీ, ప్రధాని

ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే కార్డు తరహాలో సజాతీయ వ్యవస్థగా 'ఆయుష్ గ్రిడ్'ను రూపొందించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు మోదీ.

ఆయుష్​కు సాంకేతికతను అనుసంధానం చేయాల్సిన అవసరముందని అన్నారు మోదీ. ఆయుష్ రంగంలోకి ఎక్కువ మంది వృత్తినిపుణులను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇదీ చూడండి: జిల్లా కలెక్టర్​ను పల్లకిలో మోసుకెళ్లిన గ్రామస్థులు

Nalanda (Bihar), Aug 30 (ANI): Locals set perfect example of communal harmony in Bihar's Nalanda. Hindu residents of Mari village took care of a mosque. They also played azaan with the help of pen-drive. While speaking to ANI, one of the locals said, "It is a very old mosque. There are no Muslim residents here now. So Hindus take care of the mosque. After a wedding, newly-weds come here first to take blessings."

Last Updated : Sep 28, 2019, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.