ETV Bharat / bharat

'విదేశాల్లోని భారతీయులు మే 7 నుంచి స్వదేశానికి' - COVID-19

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం. మే 7 నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేనివారినే వెనక్కి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇందుకోసం సదరు వ్యక్తులందరూ ప్రయాణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.

foreign
'విదేశాల్లోని భారతీయులు మే 7 నుంచి ఇంటికి'
author img

By

Published : May 4, 2020, 8:15 PM IST

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను మే 7నుంచి చేపట్టనున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. దశలవారిగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే భారత్​కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. విమానాలు, నౌకల ద్వారా ఈ తరలింపు ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం వారందరూ ప్రయాణఖర్చులు చెల్లించవలసి ఉంటుందని వివరించారు అధికారులు.

నిర్బంధం తప్పదు..

కేంద్రం ప్రకటన మేరకు భారత్​కు వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం 14 రోజులపాటు వారు నిర్బంధ కేంద్రాల్లో ఉండాల్సి వస్తుంది. 14 రోజులు పూర్తయిన అనంతరం వారి విషయంలో తదుపరి ప్రక్రియ ప్రారంభిస్తారు. విదేశాల్లోని వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు నియమావళి ఏర్పాటు చేసింది కేంద్రం.

లక్షణాలు లేకుంటేనే..

ఇప్పటికే పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయుల్లో వెనక్కి తీసుకొచ్చే వారి జాబితాను రూపొందించాయి. జాబితా మేరకు వారిని స్వదేశానికి వచ్చేందుకు అనుమతించనున్నారు. ప్రయాణం ప్రారంభమయ్యే ముందు వైద్య పరీక్షలు నిర్వహించి లక్షణాలు లేనివారినే వెనక్కి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రయాణంలోనూ వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్య సేతు తప్పనిసరి..

వెనక్కి వచ్చిన అనంతరం వారంతా ఆరోగ్య సేతు యాప్​ను డౌన్​లోడ్ చేసుకుని.. తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది కేంద్రం.

వివరాలు వెబ్​సైట్లలో..

ఈ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖల వెబ్​సైట్​లో ఉంచనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య పరీక్షలు, నిర్బంధ కేంద్రాలు వంటి ఏర్పాట్లు చేయాలని స్పష్టత ఇచ్చింది కేంద్రం.

కరోనా నియంత్రణ కోసం మార్చి 23న విమానాల రాకపోకలను రద్దు చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: శివుడిపైనా లాక్​డౌన్​ ఎఫెక్ట్- పార్వతి కోసం ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.