దిల్లీలో జరిగిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 14 వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు షా. సమాచార హక్కు చట్టం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని, అవిశ్వాసాన్ని తగ్గించిందని చెప్పారు. అయితే, అన్ని దేశాలు ప్రజలకు హక్కును ఇచ్చి చేతులు దులుపుకున్నాయనీ, కానీ మోదీ ప్రభుత్వం వారి హక్కును పరిరక్షిస్తుందన్నారు షా. సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని బహిర్గతం చేసి, పౌరులు సహ చట్టం కింద దరఖాస్తు చేసే అవసరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
"సమాచారాన్ని అందించి, ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. కానీ, ప్రపంచంలో సమాచార హక్కు, సురక్షిత డేటా చట్టాల మధ్య సందిగ్ధం నెలకొంది. మెల్లగా మన దగ్గర స.హ. చట్టాన్ని ఉపయోగించే అవసరమే లేకుండా చేస్తాం. డాష్ బోర్డ్ మాధ్యమంతో ఒక కొత్త పారదర్శక యుగానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ మాధ్యమాన్ని ఉపయోగించి నిరక్షరాస్య మహిళ కూడా ఇంటికి గ్యాస్ ఎప్పుడొస్తుంది, ఎంత మంది పేద మహిళలు పథకాల ప్రయోజనం పొందారన్న సమాచారాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా నేనే పునఃపరిశీలించి చెబుతున్నాను. కాబట్టి, సమాచార హక్కును వినియోగించే అవసరమే రాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
ఇదీ చూడండి:లోదుస్తుల్లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారం!