ETV Bharat / bharat

'ఆర్టీఐని 'కోరలు లేని పులి'ని చేయకండి'

ఆర్టీఐ సవరణ బిల్లును ఎలాంటి 'పరిశీలన' చేయకుండానే... కేంద్రప్రభుత్వం తనకు అత్యధిక మెజారిటీ ఉన్నందున ఆమోదింపజేసుకోవాలని చూస్తోందని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఈ సవరణ బిల్లును పార్లమెంట్​ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపించాలని డిమాండ్​ చేసింది.

author img

By

Published : Jul 24, 2019, 3:29 PM IST

'ఆర్టీఐని 'కోరలు లేని పులి'ని చేయకండి'

'సమాచార హక్కు చట్టం' సవరణ బిల్లును పార్లమెంట్ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని తృణమూల్​ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై ఎటువంటి 'పరిశీలన' చేయకుండానే పార్లమెంట్​లో ఆమోదించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

"భాజపా తనకున్న అత్యధిక మెజారిటీని ఉపయోగించి... లోపభూయిష్టమైన ఈ ఆర్టీఐ సవరణ బిల్లును లోక్​సభలో ఆమోదింపజేయాలని చూస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది."

- డెరెక్​ ఒబ్రెయిన్, తృణమూల్​ కాంగ్రెస్ అధికార ప్రతినిధి

'ఆర్టీఐ సవరణ బిల్లు-2019', 'లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ సవరణ బిల్లు-2019'.. బుధవారం రాజ్యసభలో ఆమోదించే జాబితాలో ఉన్నాయి.

"రాజ్యసభలో ఈ రోజు మూడు బిల్లులు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ బిల్లులను ఏ మాత్రం 'పరిశీలన' చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మా నుంచి ఏం ఆశిస్తోంది? బాధ్యతగల ప్రతిపక్షంగా ఉండాలని అనుకుంటుందా? లేదా మూగ ప్రేక్షకులుగా చూడాలనుకుంటుందా?"
-డెరెక్​ ఒబ్రెయిన్, తృణమూల్​ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్వీట్​

Govt passing bills in Parl without scrutiny, send RTI amendment bill to select panel: TMC
'ఆర్టీఐని 'కోరలు లేని పులి'ని చేయకండి'

'కోరలు లేని పులి'

సోమవారం ప్రతిపక్షాల నిరసనల మధ్యనే కేంద్రప్రభుత్వం లోక్​సభలో ఆర్టీఐ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ చర్య చట్టాన్ని అణగదొక్కి, పారదర్శకమైన ఆర్టీఐ ప్యానెల్​ను 'కోరలు లేని పులి'గా మార్చే ప్రయత్నమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇంతకీ బిల్లులోని అంశాలు ఏమిటంటే..

ఆర్టీఐ సవరణ బిల్లు... సమాచార హక్కు కమిషనర్ల జీతాలు, పదవీకాలం, ఇతర నిబంధనలు, షరతులు నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది.

ఇదీ చూడండి: మూకదాడులపై మోదీకి ప్రముఖుల లేఖ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.