ETV Bharat / bharat

'మోదీ సర్కార్​ది ప్యాకేజీ కాదు.. అంకెల గారడీ'

author img

By

Published : May 17, 2020, 3:53 PM IST

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ పేరిట అంకెల గారడీ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేవలం రూ.3.22 లక్షల కోట్ల ఉద్దీపనలు మాత్రమే ప్రకటించి, చేతులు దులుపుకుందని విమర్శించింది. తాము చెప్పిన లెక్కలు తప్పని నిరూపించగలరా అని సవాల్ చేసింది.

congress fires on govt package
మోదీ సర్కార్​ది ప్యాకేజీ కాదు.. అంకెల గారడీ : కాంగ్రెస్​

మోదీ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ పేరిట దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పి... రూ.3.22 లక్షల కోట్లు మాత్రమే విదిల్చిందని, ఇది దేశ జీడీపీలో 1.6 శాతం మాత్రమేనని పేర్కొంది. దీనిపై మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

అంకెల గారడీ..

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంకెల గారడీ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వం నుంచి నిజమైన ఉద్దీపనలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

"నేను ఆర్థికమంత్రిని ప్రశ్నిస్తున్నాను. ప్రధాని చెప్పిన లెక్కలు తప్పని నేను అంటున్నాను. నేను చెప్పిన లెక్కలు తప్పు అని నిరూపించగలరా అని సవాల్ చేస్తున్నాను. దీనిపై చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాను."

- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ నేత

నిర్మలా సీతారామన్ ఉద్దీపనల పేరిట అంకెల గారడీ చేసి, తిరిగి కాంగ్రెస్​పై విమర్శలకు దిగడాన్ని ఆనంద్ శర్మ తప్పుపట్టారు. ఆర్థికమంత్రి ప్రశ్నలు వేయడంకాదు, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పౌరులకు క్షమాపణలు చెప్పండి..

సరైన ప్రణాళిక లేకుండా లాక్​డౌన్ విధించడం వల్ల వలసకూలీలు చాలా ఇబ్బందులకు గురయ్యారని, వారి దుస్థితికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆనంద్​శర్మ అన్నారు. పౌరుల ప్రాథమిక, చట్టపరమైన హక్కులు ఉల్లంఘనలకు గురయ్యాయని.. మోదీ ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

భాజపా మాట మరోలా...

ఓ వైపు కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే... భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం ప్యాకేజీపై ప్రశంసలు కురిపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ.40,000 కోట్లు కేటాయించడం వల్ల స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కార్మికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులు పెంచిందని, భవిష్యత్​లో కరోనా లాంటి సంక్షోభం తలెత్తినా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు... ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు జేపీ నడ్డా.

ఇదీ చూడండి: రాహుల్​​ చేసింది 'డ్రామా' కాదంటారా?: నిర్మల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.