ఆర్టికల్ 370 రద్దు అనంతరం తమ భూములపై హక్కులు కోల్పోతామని జమ్ముకశ్మీర్ స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వీటిని దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు కనపడుతోంది. భూములపై జమ్ముకశ్మీర్ ప్రజలకున్న హక్కులను రక్షించేందుకు పార్లమెంట్లో ఓ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.
ఒక్కసారి ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ప్రజల్లో భయాలు పోతాయని హోంశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:- 370 రద్దు: కేంద్రం హామీలకు భిన్నంగా వాస్తవాలు!
జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు జమ్ముకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు వాటికి ఎన్నికలు జరగలేదు. జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వం లేకపోవడం వల్ల పార్లమెంట్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి:-