లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి 22 సార్లు ఇంధన ధరలను పెంచారంటూ భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ధరలు పెంచుతూ ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన "స్పీక్ అప్ అగైనస్ట్ ఫ్యూయల్ హైక్" కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఓవైపు కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ధరల బాదుడుతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
-
LIVE: Congress President, Smt. Sonia Gandhi joins the #SpeakUpAgainstFuelHike campaign https://t.co/ihbCCrIDpR
— Congress (@INCIndia) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">LIVE: Congress President, Smt. Sonia Gandhi joins the #SpeakUpAgainstFuelHike campaign https://t.co/ihbCCrIDpR
— Congress (@INCIndia) June 29, 2020LIVE: Congress President, Smt. Sonia Gandhi joins the #SpeakUpAgainstFuelHike campaign https://t.co/ihbCCrIDpR
— Congress (@INCIndia) June 29, 2020
"కరోనా సంక్షోభంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని.. కాంగ్రెస్ సభ్యులతో సహా నేను ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మార్చి నుంచి పెట్రోల్, డీజిల్ మీద పెంచిన ఎక్సైజ్ సుంకాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నా. దానితో దేశ ప్రజలు లబ్ధిపొందుతారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు ఇది ఉపశమనం ఇస్తుంది."
--- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.
కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వం ఖజానాను నింపుకుంటోందని విమర్శించారు సోనియా.
"అన్యాయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తోంది కేంద్రం. మార్చి 25 లాక్డౌన్ అనంతరం మోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 22సార్లు ధరలను పెంచింది. ఓవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో మాత్రం ధరలు పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలతో ప్రజల నుంచి లక్షల కోట్లను వసూలు చేస్తోంది."
--- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.
కాంగ్రెస్ చెపట్టిన "స్పీక్ అప్ అగైనస్ట్ ఫ్యూయల్ హైక్"లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సుర్జేవాలా, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇదీ చూడండి- కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్': కేజ్రీవాల్