ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు! - transgenders act 2019

ట్రాన్స్​జెండర్ల సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పథకాల ఫలాలు వారికి సవ్యంగా అందేలా చూసేందుకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయాలని భావిస్తోంది.

Govt deliberating on making special card for trans members to link them to welfare schemes
వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసే దిశగా కేంద్రం
author img

By

Published : Oct 18, 2020, 7:16 PM IST

ట్రాన్స్​ జెండర్లకు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇందుకోసం వారికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి జాతీయ ట్రాన్స్​జెండర్ మండలి మొదటి సమావేశం గురువారం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ సమావేశానికి సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్​ చంద్​ గహ్లోత్​ అధ్యక్షత వహించారు.

"ట్రాన్స్​ జెండర్లు ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంతో చర్చలు జరిపాం. కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టనున్న ప్రత్యేక గుర్తింపు కార్డు పైనా చర్చించాం. కానీ ఇంకా నిర్ణయానికి రాలేదు. మా డిమాండ్లలో ఇదీ ఒకటి. గుర్తింపు కార్డు జారీ చేయటం వల్ల ట్రాన్స్​ జెండర్స్​కు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్​లోని ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక మండలి ఉంది. సమాజంలో ట్రాన్స్​జెండర్లను మమేకం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది."

----మీరా ఫరీదా, ట్రాన్స్​జెండర్​ మండలి సభ్యురాలు.

ట్రాన్స్​జెండర్లకు సమాజంలో సమానత్వం కల్పించటం సహా ఆ దిశగా విధానాలు, చట్టాలు రూపొందించేందుకు ఆగస్టులో కేంద్రం జాతీయ మండలిని ఏర్పాటు చేసింది. ట్రాన్స్​జెండర్ల చట్టం 2019లో భాగంగా ఇది పనిచేస్తుంది. ట్రాన్స్​జెండర్లకు సంబంధించి కేంద్రం చేపట్టే అన్ని కార్యక్రమాలను ఇది సమీక్షించి, అవసరమైన సలహాలు ఇస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.