ETV Bharat / bharat

ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

author img

By

Published : Jun 24, 2020, 3:30 PM IST

Updated : Jun 24, 2020, 4:12 PM IST

co operative
ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి సహకార బ్యాంకులు.. కేంద్రం నిర్ణయం

16:02 June 24

ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో విస్తరించిన సహకార బ్యాంకులు సహా అన్ని రకాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. డిపాజిటర్ల మేలు కోసమే ఈ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. పట్టణ సహకార బ్యాంకులు, బహుళ రాష్ట్రాల్లోని సహకార బ్యాంకులకు వాణిజ్య బ్యాంకులకు అమలుచేసే నిబంధనలనే ఇకపై వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రూ 8.6 కోట్ల మంది డిపాజిటర్లు కలిగిన 1482 పట్టణ సహకార బ్యాంకులు, 52 వివిధ రాష్ట్రాల్లోని సహకార బ్యాంకులు ఆర్బీఐ పర్యవేక్షణలోకి రానున్నాయి. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన దిల్లీలో భేటీ అయిన మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ముద్రయోజనలో వడ్డీ రాయితీ

ముద్ర యోజన కింద శిశు లోన్ కేటగిరీలో చిన్నమొత్తాలను రుణలుగా తీసుకున్నవారికి  2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం. ముద్రా యోజన కింద 2020 మార్చి 31 వరకు రుణాలను చెల్లించలేని వారికి ఇది వర్తించనుంది. 

ముద్రయోజనలో శిశు లోన్ కింద రూ. 50,000 వరకు రుణంగా అందిస్తారు.  

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు..

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన డెయిరీ, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 15,000 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది కేబినెట్.

ఓబీసీ కమిషన్ గడువు పెంపు..

ఓబీసీ కమిషన్ నివేదిక సమర్పించేందుకు మరో ఆరు నెలల పాటు గడువు పొడిగించింది కేంద్రం. తాజా గడువును జనవరి 31కి పెంచింది. ఓబీసీ కమిషన్ ఇతర వెనకబడిన తరగతుల వారి స్థితిగతులపై అధ్యయనం చేసి.. నివేదిక సమర్పించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వారి పనికి అంతరాయం కలిగిందని.. ఈ నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్లు చెప్పింది కేంద్రం.  

15:15 June 24

కేంద్రమంత్రివర్గ సమావేశం నిర్ణయాలు

సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి తెస్తూ కీలక నిర్ణయం

ఈమేరకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసిన కేంద్రమంత్రివర్గం

దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి రానున్న 1540 సహకార బ్యాంకులు

8.60 కోట్లమంది డిపాజిటర్లకు భరోనా కల్పించినట్లు అవుతుంది: జావడేకర్‌

4 లక్షల 84 వేల కోట్ల విలువైన డిపాజిట్లు భద్రంగా ఉంటాయి: జావడేకర్‌

షెడ్యూల్‌ బ్యాంకులకు వర్తించే ఆర్‌బీఐ అధికారాలు ఇకపై సహకార బ్యాంకులకు కూడా వర్తిస్తాయి

Last Updated : Jun 24, 2020, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.