మధ్యప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ పురుషోత్తం శర్మను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన భార్యపై గృహ హింసకు పాల్పడినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తన భర్త నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆయన భార్య ఫిర్యాదు చేసింది. భద్రత కల్పించాలని అభ్యర్థించింది. ఈ విషయంలో శర్మపై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది.