ఇదీ జరిగింది...
ఓ బస్సు తిరునెల్వేలి నుంచి నాగర్‌కోయిల్‌కు ప్రయాణిస్తోంది. ఆ బస్సులో ఉన్న కండక్టర్ రమేశ్ యథావిధిగా తన విధుల్ని నిర్వహిస్తున్నాడు. వరుసగా ప్రయాణికులందరికీ టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించాడు. అందులో ఇద్దరు పోలీసులు ఉన్నారు. వారినీ టిక్కెట్లు తీసుకోమని అడగగా... ఎలాంటి స్పందనా లేదు. రమేశ్ మిగతా వారికి టిక్కెట్లిచ్చి తిరిగి పోలీసుల వద్దకు వచ్చాడు. వారిని మళ్లీ టికెట్ తీసుకోమని అడిగాడు. అందుకు ఆగ్రహించిన పోలీసులు సెకన్ల వ్యవధిలో రమేశ్ ముఖంపై రక్తం చిందేలా పిడిగుద్దులు విసిరారు. విచక్షణారహితంగా ప్రవర్తించారు. అనంతరం కండక్టర్‌పై వాదనకు దిగారు.
చుట్టుపక్కన వారు ఆపినా ఆగలేదు రక్షక భటులు. పోలీసుల వీరంగాన్ని ప్రయాణికులు తమ చరవాణిలో బంధించారు. టిక్కెట్టు తీసుకోమన్నందుకు తనను చితకబాదారని చరవాణిలో స్వీయవీడియో తీసి తన బాధను చెప్పుకున్నాడా కండక్టర్.
రమేశ్ ఆ ఇద్దరు పోలీసులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. కానీ కొద్ది సేపటికే బెయిల్‌పై బయటకు రావడం విశేషం.
ఇదీ చూడండి : గుజరాత్లో ఘోర రోడ్డుప్రమాదం.. 18 మంది మృతి