ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు చాలా దేశాల్లో మరణాల సంఖ్య పెరిగిపోతుంటే.. ఉద్యోగస్థులనూ ఈ వైరస్ వణికిస్తోంది.
బెంగళూరులో తమ సంస్థకు చెందిన ఉద్యోగికి కరోనా సోకినట్లు గూగుల్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ఆఫీసులో పని చేస్తున్న తమ ఉద్యోగులను రేపటి నుంచి ఇంటి నుంచే పనిచేయాలని చెప్పినట్లు సంస్థ పేర్కొంది.
112 మందికి కరోనా నెగిటివ్..
దిల్లీ ఐటీబీపీ ప్రత్యేక శిబిరంలో వైద్య పరిశీలనలో ఉంచిన వారిలో 112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరంతా చైనా వుహాన్ నుంచి వెనక్కు వచ్చిన వారే. ఈ నేపథ్యంలో వారిని నిర్భంధ కేంద్రం నుంచి పంపించనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 36 మంది విదేశీయులూ ఉన్నారు.