ETV Bharat / bharat

కాపురంలో చిచ్చు పెట్టిందని గూగుల్​​పై కేసు - wife and husband fight due to google maps

'కుడివైపు తిరగండి.. ఎడమ వైపు వెళ్లండి.. ఇప్పుడు యూటర్న్​ తీసుకోండి.. మీరు చేరాల్సిన గమ్యం వచ్చేసింది.' అంటూ బయల్దేరిన చోటుకే తీసుకొస్తుంటాయి కొన్ని మ్యాపింగ్​ యాప్​లు. తమిళనాడులో ఓ వ్యాపారితోనూ ఇలానే ఆడుకుందట గూగుల్​ మ్యాప్స్. అంతటితో ఆగక భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో, చిర్రెత్తి గూగుల్​ మ్యాప్స్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ వ్యాపారి. ఇంతకీ... గూగుల్​ మ్యాప్స్​ చేసిన తప్పేంటి?

Google map app creates trouble in the family, complaint lodged against google
కాపురంలో చిచ్చు పెట్టిన గూగుల్​ మ్యాప్స్​​పై ఫిర్యాదు!
author img

By

Published : May 22, 2020, 6:11 PM IST

గూగుల్​ మ్యాప్స్ కాపురాలు కూల్చుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమిళనాడుకు చెందిన చంద్రశేఖరన్​.

నాగపట్టణం జిల్లా మైలదురైకి చెందిన ఆర్​ చంద్రశేఖరన్​ ఫోన్​లో గూగుల్ మ్యాప్స్​ యాప్​ ఉంది. ఎప్పటికప్పుడు అతడి కదలికలను గమనించేందుకు చంద్రశేఖరన్ భార్య గూగుల్​ మ్యాప్స్​ టైమ్​లైన్​ చెక్​ చేస్తూ ఉంటుంది. అయితే మే 20న చంద్రశేఖరన్​.. భార్య చేతికి ఫోన్​ ఇచ్చి బుక్కైపోయాడు.

'నేనెక్కడికెళ్లా..?'

టైమ్​లైన్​లో రికార్డైన గూగుల్ ​మ్యాప్ హిస్టరీ​ చూసింది చంద్రశేఖరన్ భార్య. అంతే.. 'ఆ సమయానికి అక్కడికెందుకు వెళ్లావు?' అని ఎర్రటి కళ్లతో ప్రశ్నించింది. 'ఎక్కడికి?' అమయాకంగా బదులిచ్చాడు చంద్ర శేఖరన్​. 'ఇక్కడంతా స్పష్టంగా కనిపిస్తుంది.. నువ్వెళ్లావ్​!' అని కసిరింది. 'అబ్బే నేనెక్కడికీ వెళ్లలేదే' అని​ ఎన్ని రకాలుగా చెప్పినా చంద్రశేఖరన్​ భార్య మాత్రం.. గూగుల్​ మ్యాప్స్​నే నమ్మింది. తాను వెళ్లని ప్రదేశాలను గూగుల్​మ్యాప్స్ తప్పుగా రికార్డు చేసిందని.. మొరపెట్టుకున్నా వినలేదు.

Google map app creates trouble in the family, complaint lodged against google
కాపురంలో చిచ్చు పెట్టిన గూగుల్​ మ్యాప్స్​​పై ఫిర్యాదు!

ఇక చంద్రశేఖరన్​కు మనఃశాంతి కరవైంది. భార్య అనుమానానికి కారణమైన గూగుల్​మ్యాప్స్​పై కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే స్థానిక పోలీస్​ స్టేషన్​కు వెళ్లి కేసు పెట్టాడు. తన ప్రశాంతతకు భంగం కలిగించిన గూగుల్​ మ్యాప్స్ తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశాడు.

ఇదీ చదవండి: జూమ్​కాల్​​ లైవ్​లో తండ్రిని పొడిచి చంపిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.