ETV Bharat / bharat

ఆరేళ్ల తర్వాత శ్రీ పద్మనాభుడి చందన ప్రసాదం

కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ఆరేళ్ల విరామం తర్వాత చందన ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభించారు. ఈ బంగారు-పసుపు రంగు చందన ప్రసాదం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ అప్పట్లో నిలిపివేశారు.

Golden sandalwood paste prasadam to be distributed again at Sree Padmanabhaswamy Temple
ఆరేళ్ల తర్వాత శ్రీ పద్మనాభస్వామి ప్రసాదం పంపిణీ
author img

By

Published : Nov 22, 2020, 10:25 AM IST

కేరళ తిరువనంతపురంలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ పద్మనాభస్వామి.. సంప్రదాయ, సుగంద భరితమైన చందన ప్రసాదం పంపిణీ ప్రక్రియను దాదాపు ఆరేళ్ల తర్వాత పునరుద్ధరించారు. బంగారు-పసుపు వర్ణం గల చందన ప్రసాదం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలతో అప్పట్లో ఆలయ కార్యనిర్వాహక అధికారిగా ఉన్న కెఎన్​ సతీశ్​ నిలిపివేశారు.

ఆహార భద్రత విభాగం సహా అనేక పరీక్షలు చేసి ధ్రువీకరించిన అనంతరం ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభించింది కమిటీ. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని శనివారం పునరుద్ధరించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ట్రావెన్​కోర్​ రాయల్ కుటుంబ సభ్యులు, ఆలయ సలహా కమిటీ సభ్యులు, దేవాలయ కార్యనిర్వహణ అధికారి హాజరయ్యారు.

ఇదీ చూడండి: అనంత పద్మనాభుడి ఆలయ నిర్వహణ ట్రావెన్​కోర్​కే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.