గుజరాత్‌లోని కస్టమ్స్ విభాగంలో భారీ లూటీ జరిగినట్టు బయటపడింది. జామ్‌నగర్‌లోని కార్యాలయంలో రూ.కోటీ 10 లక్షలు విలువైన బంగారం దోపిడీకి గురైనట్టు ఆ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
1982 -1986 సంవత్సరాల్లో భుజ్‌లోని కస్టమ్స్ శాఖ కార్యాలయం శిథిలమైంది. ఫలితంగా ఆ ఆఫీస్‌ను అక్కడి నుంచి జామ్‌నగర్‌కు తరలించారు. ఈ సందర్భంలోనే పసిడి మాయమైనట్టు తెలుస్తోంది.
అధికారుల వివరాల ప్రకారం.. ఘటన జరిగి 34 ఏళ్లు గడిచిన తర్వాత దోపిడీ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ విషయమై విచారణ చేపట్టేందుకు అహ్మదాబాద్ కస్టమ్స్ ప్రధాన కార్యాలయం అధికారులు జామ్‌నగర్‌కు చేరుకున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: విధి అడ్డుపడ్డా వివాహం ఆగలేదు- స్ట్రెచ్చర్పైనే!