కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు మార్కెట్లో రకరకాల డిజైన్లతో కూడిన మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో ఓ వ్యక్తి బంగారంతో చేసిన మాస్క్‌ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వార్త కాస్త వైరల్ కావటం వల్ల తనూ కూడా అలాంటి మాస్క్ ధరించాలని అనుకున్న ఒడిశా కటక్‌కు చెందిన వ్యాపారవేత్త అలోక్ మహంతి. మేలిమి పుత్తడితో మాస్క్ తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ.3.5 లక్షలు ఖర్చు చేశాడట.
గత 40 ఏళ్లుగా విభిన్న బంగారు ఆభరణాలు ధరిస్తున్నానని చెప్పుకొచ్చాడు అలోక్. అతడిని స్థానికంగా ప్రజలు గోల్డ్ మ్యాన్ అని కూడా పిలుస్తుంటారట.
ఇదీ చూడండి:పైలట్ వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా