ETV Bharat / bharat

అల్లా మహిమ! ఈ 'బకరా' ఎంతో అమూల్యం​ - అల్లా

బక్రీద్​ సందర్భంగా మేకపోతులతో మార్కెట్​లన్నీ కిటకిటలాడుతున్నాయి. మేకల ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది. శరీరంపై అల్లా-మొహమ్మద్ అని ఉన్న ఓ రెండు మేకలు మాత్రం రూ.4 లక్షల ఖరీదు పలుకుతున్నాయి.

అల్లా మహిమ! ఈ 'బకరా' ఎంతో అమూల్యం​
author img

By

Published : Aug 10, 2019, 6:02 AM IST

అల్లా మహిమ! ఈ 'బకరా' ఎంతో అమూల్యం​
అప్పుడే 'బక్రీద్ ముబారక్'​ అంటూ బకరాల సందడి షురూ అయ్యింది. మేలైన, విభిన్నమైన, ప్రత్యేకతలున్న మేకపోతులు మార్కెట్​లోకి వచ్చేశాయి. బక్రీద్​ అనగానే మేకలకు ధర బాగా పెరుగుతుంది. లక్షల్లో పలికే పోతులున్నాయి. దిల్లీలోని వెల్​కమ్ పీలీమిట్టీ మార్కెట్​లో ఓ రెండు మేకల ఖరీదు అక్షరాల 4 లక్షల రూపాయలు.

ఎందుకింత రేటు?

ఉత్తర-తూర్పు దిల్లీలోని పీలీమిట్టీ మార్కెట్​లో రెండు మేకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అల్లా-మొహమ్మద్ అని ఉర్దూలో రాసినట్టు ఉన్నాయి వాటి శరీరంపై ఉన్న మచ్చలు. మరో మేక శరీరంపై చాంద్​(చందమామ) ఆకారం కనిపిస్తుంది. బక్రీద్​ రోజు ఇలాంటి ప్రత్యేకతలు గల మేకపోతులను బలిస్తే శుభం కలుగుతుందని భావించేవారు చాలా మందే ఉన్నారు. పుట్టుకతోనే అల్లా గుర్తులను శరీరంపై ముద్రించుకు పుట్టినట్టు కనిపిస్తున్న ఈ మేకలకు అందుకే భారీ డిమాండ్ నెలకొంది.

ఆ మేకల యజమాని ప్రస్తుతం వాటికి 4 లక్షల ధర ఖరారు చేశారు. అనుకున్న ధర వస్తేగానీ అల్లా-మొహమ్మద్​, చాంద్​ మేకలను అమ్మలేను అంటున్నారు.
ప్రతి సంవత్సరంలాగే ఈసారీ బక్రీద్​ సందర్భంగా మేకపోతులకు డిమాండ్​ బాగా పెరిగింది. ఇక ఏమైనా ప్రత్యేకత ఉంటే చాలు వ్యాపారులు వారికి అనుకూలంగా మలుచుకుని ఖరీదును అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

బకరాల కిటకిటతో-కాసుల పంట

దిల్లీలోని పీలీమిట్టి మార్కెట్​ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విక్రయదారులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కరి వద్ద 2 నుంచి డజనుల సంఖ్యలో మేకలున్నాయి. ఇక్కడ వ్యాపారం జరిగిన తర్వాత విక్రయదారులు సొమ్ముదాచుకోవటంలో అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ రెండు మూడు రోజుల్లో వారి బిజినెస్​ ఏ రేంజ్​లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఈద్​-కోసం..

మేకల మార్కెట్​ ఉండే రోడ్​ నంబర్​ 66 ఒక భాగం పూర్తిగా మేకలకే కేటాయించారు. ఇక్కడ పోలీసులు రద్దీని అదుపులో ఉంచుతారు. సిలమ్​పుర్​, జాకరాబాద్​, వెల్​కమ్​ పీలీమిట్టిలలో మేకల విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

"దూర ప్రాంతాల నుంచి మేకలను అమ్ముకునేందుకు వచ్చిన వారి కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. వర్షం, ఎండ నుంచి మేకలకు ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్​ షెడ్​లు వేశాం. వాటికి తాగడానికి నీరు అందుబాటులో ఉంచాం. "
-అమన్​ ఏక్తా కమిటీ చైర్మెన్

ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!

Intro:Body:

n

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.