ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మోదీ వదులుకోవాల్సింది ద్వేషాన్ని అని.. సామాజిక మాధ్యమాలను కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ నుంచి తప్పుకోనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర ప్రకటించారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కూడా మోదీ నిర్ణయంపై స్పందించారు. మోదీ పేరుతో సామాజిక మాధ్యమాల వేదికగా బెదిరింపులకు పాల్పడే వారికీ ఇదే సూచన ఇవ్వాలని ట్వీట్ చేశారు.