ETV Bharat / bharat

'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి' - కేంద్ర ఎన్నికల సంఘం

కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే... తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కోరింది.

Give suggesions on the conduct of elections in corona crisis: EC
కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణపై సూచనలు ఇవ్వండి: ఈసీ
author img

By

Published : Jul 18, 2020, 12:32 PM IST

కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై తమ 'అభిప్రాయాలు, సూచనలు' ఇవ్వాలని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్ననేపథ్యంలోనే జులై 31లోపు తమ అభిప్రాయాలు తెలపాలని అన్ని పార్టీలను కోరింది ఈసీ.

సూపర్ స్పెడ్డర్ ఈవెంట్

ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల్లో ఉపఎన్నికలు ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్​లో జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో బిహార్ విపక్ష పార్టీలు ఈసీని ఆశ్రయించాయి. రానున్న ఎన్నికలు సూపర్ స్పెడ్డర్ ఈవెంట్​ కాకుండా చూడాలని అభ్యర్థించాయి. అలాగే ఒక పోలింగ్ కేంద్రంలో కేవలం 250 మంది ఓటర్లను మాత్రమే అనుమతించాలని కోరాయి.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 34,884 కేసులు, 671 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.