ETV Bharat / bharat

ఆన్​లైన్​ పాఠాల కోసం ఆరు కిలోమీటర్లు నడక..

వీధిదీపాల కింద చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరినవారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. కానీ కేరళ ఇడుక్కి జిల్లాకు చెందిన విద్యార్థులు మాత్రం విద్యుత్తు సదుపాయం, స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు ఉన్నా చదువు కోసం రోజూ ఆరు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తున్నారు. రోడ్డు పక్కన కూర్చొని ఆన్​లైన్​ పాఠాలు వింటున్నారు. ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Girls walk 6 km from home in search of internet connectivity to attend online classes every day   Students at Rajamala, Idukki, turn crash barriers along the roads their study area
ఆన్​లైన్​ పాఠాల కోసం ఆరు కిలోమీటర్లు నడక..
author img

By

Published : Dec 9, 2020, 3:30 PM IST

ఆన్​లైన్​ పాఠాల కోసం ఆరు కిలోమీటర్లు నడక..

కొవిడ్​-19తో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసినందువల్ల విద్యార్థులు ఆన్​లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. అయితే కేరళ ఇడుక్కి జిల్లా రాజమాలాకు చెందిన విద్యార్థులు సిగ్నల్ కోసం రోజూ ఆరు కిలోమీటర్లు నడుస్తున్నారు. ఎండా, వానల్ని సైతం లెక్కచేయకుండా రోడ్డునే పాఠశాలగా భావించి ఆన్​లైన్​ తరగతులు వింటున్నారు. వీళ్లంతా స్థానిక కాఫీ తోటల్లో పనిచేసేవారి పిల్లలు.

" సిగ్నల్​ కోసం రోజూ 12 కిలోమీటర్లు నడక ప్రయాణం చేయటం కష్టంగా ఉంది. దారిలో ఎక్కడా విశ్రాంతి సదుపాయం లేదు. మూత్రశాలలు లేవు. మాకు ఇంటర్నెట్​ సదుపాయం లేదంటే ఉపాధ్యాయులు నమ్మటం లేదు. దీంతో మేము సిగ్నల్ ఉన్న చోటుకు వెళ్లి ఆన్​లైన్​ క్లాసులు వింటున్నాం. సాయంత్రం ఐదు గంటలవరుకూ రోడ్డు పక్కనే కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది."

--ఓ విద్యార్థిని ఆవేదన

8 నెలలుగా తప్పని పాట్లు

తెల్లవారుజామునే పుస్తకాలు, మొబైల్​ఫోన్స్​, లంచ్​బాక్స్​లు సిద్ధం చేసుకుని నడక ప్రారంభిస్తారు. సిగ్నల్​ కోసం 6 కిలోమీటర్లు నడిచి ఓ రోడ్డు పక్కన కూర్చొని ఆన్​లైన్​ క్లాసులు వింటున్నారు. 8నెలలుగా విద్యార్థులు ఇలానే పాఠాలను నేర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్​ సదుపాయం లేక చాలా మంది విద్యార్థులు చదువు మానేశారు.

ఇదీ చదవండి : ప్రశాంతంగా కేరళ 'స్థానిక' పోరు- ప్రముఖుల ఓట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.