ETV Bharat / bharat

లిఫ్ట్​ ఇస్తానని చెప్పి మహిళపై అత్యాచారం - latest rape in Uttar Pradesh

ఉత్తర్​ప్రదేశ్​లో మరో మహిళ అత్యాచారానికి గురైంది. పని ముగించుకొని కార్యాలయం నుంచి తిరిగి వస్తున్న ఆమెపై తెలిసిన వ్యక్తే తన స్నేహితుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

Girl gang-raped in UP's Kannauj
ఇంటికి దిగబెడతనని చెప్పి- మహిళపై అఘాయిత్యం
author img

By

Published : Oct 11, 2020, 3:36 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మరో మహిళ అత్యాచారానికి గురైంది. తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

రాష్ట్రంలోని కనౌజ్​ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ... బట్టల షాపులో పని చేస్తోంది. పని ముగించుకొని ఇంటికి వస్తూ కూరగాయల కొనడానికి మధ్యలో ఆగింది. అనంతరం ఇంటికి బయలుదేరింది.

ఇంతలో ఆమెకు తెలిసిన ఓ వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చి.. ఇంటి వద్ద దిగబెడతానని చెప్పాడు. దీనికి ఆమె మొదట నిరాకరించింది. అయితే మాయమాటలతో ఒప్పించి, బైక్​ ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక దారిమళ్లించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆమెపై అఘాయిత్యం చేశారు. అపస్మారక స్థితిలో వదిలి పరారయ్యారు.

ఆ నంబరు పని చేయలేదు

ఘటనపై పోలీసులకు సమాచారం అందించేందుకు పోలీసుల సహాయక కేంద్రం నంబరు 112కు ప్రయత్నించింది బాధితురాలు. అయితే ఆ నంబరు పని చేయలేదని తెలిపింది. ఆమె ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పంది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇద్దరు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: అత్యాచారం జరిగిందని నిప్పంటించుకున్న బాలిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.