ETV Bharat / bharat

కోతి దెబ్బకు పులుల గుంపు పరార్​!

తన ప్రాంతంలోకి వచ్చిన రెండు పులి పిల్లలను ఓ ఆట ఆడుకుంది ఓ కోతి. తన స్థావరం నుంచి వెళ్లిపొమ్మని ఎంత చెప్పినా వినకుండా ... అక్కడే ఉన్నందుకు చెవులను మెలితిప్పుతూ వాటిని ఏడిపించింది. ఈ ఘటన అసోం అటవీ ప్రాంతంలో జరిగింది.

Gibbon teases tiger cubs in forest. Hilarious old video goes viral
పులి పిల్లల చెవులను మెలివేసిన గిబ్బన్​ కోతి
author img

By

Published : Jul 6, 2020, 5:15 PM IST

అనువుగాని చోట అధికుల మనరాదు అనే సామెత చక్కగా సరిపోతుంది ఈ పులి పిల్లలకు. మనకు తగని ప్రదేశంలో, మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. కానీ ఈ పులి పిల్లలు మాత్రం.... ఓ గిబ్బన్ కోతి ఆవాసంలోకి చొరబడి ఎంచక్కా ఓ కునుకు తీశాయి. అది గమనించిన గిబ్బన్.. పులులకు మర్యాదగా అక్కడి నుంచి వెళ్లాలని తన భాషలో అరచి చెప్పింది.

మాట వినని పులి పిల్లలు అక్కడి నుంచి కదలలేదు. ఆధిక్యతను ప్రదర్శించాలనుకున్న వాటికి తన చేష్టలతో చుక్కలు చూపించింది. వాటి చెవులను మెలితిప్పుతూ ఓ ఆట ఆడుకుంది. చెట్టుపై అటు ఇటూ వేగంగా విన్యాసాలు చేస్తూ... పులిపిల్లలను కాసేపు ఏడిపించింది. కోతి చేష్టలకు విసుగెత్తిన పులులు రెండు అక్కడి నుంచి దూరంగా పారిపోయాయి.

  • If you haven’t seen this- hilarious way in which Gibbon teases the tiger cubs😊

    Gibbons are smaller apes famous for their swift & graceful way of swinging through the trees by their long arms. Here it demonstrates what it means to be so swift...

    In India, seen only in Assam. pic.twitter.com/BJ3dMOTrvu

    — Susanta Nanda IFS (@susantananda3) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసోం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను.. ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నందా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి:'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.